- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పునర్నవి సీక్రెట్ మ్యారేజ్.. నెట్టింట వైరల్ అవుతున్న వెడ్డింగ్ పిక్స్!
ఉయ్యాల - జంపాల సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన నటి పునర్నవి భూపాలం గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.

దిశ, వెబ్‌డెస్క్: ఉయ్యాల - జంపాల సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన నటి పునర్నవి భూపాలం గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అమాయకమైన పల్లెటూరి అమ్మాయి పాత్రలో మెప్పించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత బిగ్ బాస్ తెలుగు సీజన్-3లో ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులను ఆకట్టుకుంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఫాలోయింగ్ పెంచుకుంది. తాజాగా పునర్నవి వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. ఎలాంటి హడావిడి లేకుండా.. ముందస్తు సమాచారం లేకుండా సైలెంట్‌గా పెళ్లి చేసుకొని వార్తల్లోకి నిలిచింది. ప్రస్తుతం ఆమె వెడ్డింగ్ ఫొటోలు నెట్టింట ట్రెండ్ అవుతూ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్‌గా పనిచేస్తూ, ట్రావెలర్‌గా కూడా మంచి గుర్తింపు పొందిన హేమంత్ వర్మను పునర్నవి వివాహం చేసుకున్నారు. ఇటీవల డిసెంబర్‌లో నిశ్చితార్థం చేసుకున్నాను అంటూ ప్రకటించింది పునర్నవి. తాజాగా మార్చి 20న వీరి పెళ్లి జరిగినట్టు సమాచారం.
హీరోయిన్గా రీ ఎంట్రీ ఇవ్వనున్న నిహారిక






