- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Jailer 2: జైలర్ 2లో మరో నటి.. షూటింగ్ కూడా కంప్లీట్
by Chukka Sudharani |
సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం ‘జైలర్ 2’పై ఫోకస్ పెట్టాడు.

X
దిశ, సినిమా: సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం ‘జైలర్ 2’పై ఫోకస్ పెట్టాడు. బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ‘జైలర్’ కు సీక్వెల్‌గా వస్తున్న ఈ చిత్రానికి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. యాక్షన్ కామెడీ చిత్రంగా రూపొందుతోన్న ఈ మూవీలో ఎస్.జె సూర్య, రమ్య క్రిష్ణ, యోగిబాబు, మార్నీ మీనన్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ స్టార్ట్ కాగా.. తాజాగా ఈ మూవీలో మరో నటి భాగం అయినట్లు తెలుస్తుంది. ఇందులో నటి షమ్నా కాసిం అలియాస్ పూర్ణ కూడా ఓ కీలకమైన రోల్‌లో నటిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ హీరోయిన్ రీసెంట్‌గా షూటింగ్‌లో కూడా పాల్గొనగా.. ఆమె పాత్రకు సంబంధించిన షూటింగ్‌ను కంప్లీట్ చేసేందుకు 20 రోజులు పట్టిందని కోలీవుడ్ వర్గాల నుంచి సమాచారం. ఇక దీనిపై త్వరలోనే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇవ్వనున్నారట మేకర్స్.
Next Story






