- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. యంగ్ హీరోయిన్ ఆత్మహత్య
కన్నడ, తమిళ టీవీ సీరియల్ హీరోయిన్ సీ.ఎం. నందిని ఆత్మహత్య చేసుకుంది. బెంగళూరు కెంగేరి ప్రాంతంలోని పేయింగ్ గెస్ట్‌గా ఉంటున్న ఇంట్లో సూసైడ్‌కు పాల్పడింది. డిసెంబర్ 29 ఉదయం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసుల ప్రకారం డిసెంబర్

దిశ, సినిమా : కన్నడ, తమిళ టీవీ సీరియల్ హీరోయిన్ సీ.ఎం. నందిని ఆత్మహత్య చేసుకుంది. బెంగళూరు కెంగేరి ప్రాంతంలోని పేయింగ్ గెస్ట్‌గా ఉంటున్న ఇంట్లో సూసైడ్‌కు పాల్పడింది. డిసెంబర్ 29 ఉదయం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసుల ప్రకారం డిసెంబర్ 28 రాత్రి 11:16 గంటల నుంచి డిసెంబర్ 29 అర్ధరాత్రి 12:30 గంటల మధ్య ఆత్మహత్య చేసుకున్నట్లు అంచనా. నందిని డిసెంబర్ 28 సాయంత్రం తన స్నేహితుడు పునీత్ ఇంటికి వెళ్లి.. రాత్రి 11:23 గంటల సమయంలో పీజీకి తిరిగి వచ్చింది. ఆ తర్వాత ఆమెకు కాల్ చేస్తే స్పందించకపోవడంతో ఫ్రెండ్ పీజీ మేనేజర్‌కు సమాచారం అందించాడు. మేనేజర్ గది తలుపు బలవంతంగా ఓపెన్ చేయగా.. నందిని విండో గ్రిల్‌కు ఉరేసుకుంది. వెంటనే 112 ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్‌కు కాల్ చేశారు. ఘటనాస్థలికి చేరుకున్న కెంగేరి పోలీసులు ఉదయం మూడు గంటల 45 నిమిషాల సమయంలో స్పాట్‌కు చేరుకుని మరణాన్ని నిర్ధారించారు.
మరోవైపు సూసైడ్‌లో నోట్‌లో కుటుంబ ఒత్తిళ్ల కారణంగా ఆమె చనిపోతున్నట్లు రాసింది. యాక్టింగ్ కొనసాగించాలని కోరుకుంటున్న ఆమెకు.. 2023లో తండ్రి మరణం తర్వాత వచ్చిన ప్రభుత్వ ఉద్యోగం తీసుకోవడం ఇష్టం లేదని.. కానీ తన మాటలు ఎవరు వినరని.. పెళ్లి చేసుకుని, సెటిల్ కావాలని కోరుకుంటున్నారని రాసుకొచ్చింది. కుటుంబం నుంచి పెళ్లి ఒత్తిడి, కెరీర్ ఎంపికలపై విభేదాలు ఉన్నాయని తెలిపింది.






