ఆ పనికి భర్త అవసరం లేదు.. తల్లిని కావాలని ఉందంటూ నటి షాకింగ్ కామెంట్స్

by Mallepaka Hamsa |   (  Updated:2025-02-01 09:36:35  IST  )

బాలీవుడ్ హీరోయిన్ టీనా దత్తా(Tina Datta) మొదట చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.

ఆ పనికి భర్త అవసరం లేదు.. తల్లిని కావాలని ఉందంటూ నటి షాకింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: బాలీవుడ్ హీరోయిన్ టీనా దత్తా(Tina Datta) మొదట చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. కలర్స్ టీవీ ‘ఉత్తరన్’(Uttaran) సీరియల్ ద్వారా పరిచయం అయి ఫుల్ పాపులారిటీ సొంతం చేసుకుంది. ఆ తర్వాత పలు సీరియల్స్‌లో నటించిన ఆమెతనకంటూ ప్రత్యేక గుర్తింపును దక్కించుకుంది. ఇటీవల వెబ్ సిరీస్‌తో ప్రేక్షకులను అలరించింది. ‘పర్సనల్ ట్రైలర్’(Personal trailer)లో కనిపించింది. ఇదిలా ఉంటే.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న టీనా దత్తా పెళ్లి, పిల్లలపై షాకింగ్ కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచింది.

‘‘పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. కానీ తల్లిని కావాలని కోరుకుంటున్నాను. నేను పెళ్లి చేసుకోవడానికి ఏమాత్రం తొందర పడటం లేదు. అయితే భవిష్యత్తులో మంచి తల్లిని కాగలనని నమ్ముతున్నాను. ప్రస్తుతం పెళ్లి గురించి కూడా ఎటువంటి ప్రణాళికలు లేవు. కానీ సరైన సమయం వచ్చినప్పుడు మంచి తల్లిని అని నిరూపించుకుంటా. బిడ్డను దత్తత తీసుకోవడమా లేదా సరోగసీ ద్వారా తల్లిని కావడమా అనేది ఇంకా డిసైడ్ కాలేదు. ఒంటరిగా నా కుటుంబాన్ని నేను చూసుకోగలనని నమ్ముతున్నా.

పిల్లల కోసం భర్త అవసరం లేదు. ఆ బాధ్యతను నిర్వర్తించడానికి నేనొక్కదాన్నే చాలు. నాకు సుస్మితాసేన్(Sushmita Sen) స్ఫూర్తినిచ్చింది. నా జీవితంలో ఏ నిర్ణయం తీసుకున్న నా తల్లిదండ్రులు సపోర్ట్‌గా ఉంటారు. భవిష్యత్తులో సరోగసీ ద్వారా తల్లిని కావడం లేదీ దత్తత తీసుకున్నప్పటికీ నా పేరెంట్స్ నా అభిప్రాయాన్ని గౌరవిస్తారు’’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం టీనా దత్తా కామెంట్స్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి. ఇక ఈ విషయం తెలుసుకున్న వారంతా షాక్‌కు గురవుతున్నారు. ఇదేం కోరిక తల్లి అని పలు రకాలుగా చర్చించుకుంటున్నారు.

Next Story