ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. స్టార్ నటి మృతి

by Sujitha Rachapalli |

సౌత్ కొరియా నటి లీ సియో-యీ కన్నుమూసింది. దీంతో కొరియన్ ఎంటర్‌టైన్మెంట్ ఇండస్ట్రీ, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె మేనేజర్ జూలై 1న ఇన్‌స్టాగ్రామ్‌లో భావోద్వేగ పోస్ట్ ద్వారా ఈ వార్తను వెల్లడించాడు.

ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. స్టార్ నటి మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: సౌత్ కొరియా నటి లీ సియో-యీ కన్నుమూసింది. దీంతో కొరియన్ ఎంటర్‌టైన్మెంట్ ఇండస్ట్రీ, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె మేనేజర్ జూలై 1న ఇన్‌స్టాగ్రామ్‌లో భావోద్వేగ పోస్ట్ ద్వారా ఈ వార్తను వెల్లడించాడు. పది రోజుల ముందు అంటే జూన్ 20న మరణించినట్లు తెలిపాడు. అయితే ఇందుకు గల కారణం ఇంకా తెలియలేదు. కానీ ఆమె మరణం కే డ్రామాకు భారీ నష్టమని.. ఆమె ఎక్కడున్నా ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నారు ఫ్యాన్స్.

లీ సియో-యీ 2013లో MBC హిస్టారికల్ డ్రామా ‘హర్ జున్, ది ఒరిజినల్ స్టోరీ’తో నటనా రంగంలోకి అడుగుపెట్టారు. కానీ 2014 SBS డ్రామా ‘చియాంగ్‌డామ్-డాంగ్ స్కాండల్’తో మంచి గుర్తింపు లభించింది. ఇందులో తన పాత్రకు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ‘బ్రావో మై లైఫ్’, ‘రొమాన్స్ స్పెషల్ లా’, ‘సిటీ ఆఫ్ ది సన్’, ‘పెగాసస్ మార్కెట్’ వంటి డ్రామాలు..‘ది కింగ్’, ‘కిల్లింగ్ రొమాన్స్’, ‘స్కార్లెట్ ఇన్నోసెన్స్’, ‘ది రాయల్ టైలర్’ వంటి సినిమాలతో కెరీర్‌లో దూసుకుపోయింది. ఆమె చివరగా tvN రొమాంటిక్ కామెడీ ‘ది డివోర్స్ ఇన్సూరెన్స్’లో కనిపించారు. ఇక హాంకుక్ యూనివర్శిటీ ఆఫ్ ఫారిన్ స్టడీస్‌లో చెక్, స్లోవాక్ భాషలను అభ్యసించిన ఆమె.. పుసాన్ నేషనల్ యూనివర్శిటీలో హ్యూమానిటీస్‌లో ఉన్నత విద్యను అభ్యసించింది. బేస్‌బాల్‌లోనూ ప్రావీణ్యం కలిగి ఉంది.

Next Story