సినిమాల్లోకి అడుగు పెట్టబోతున్న సీనియర్ నటి కూతురు.. కానీ అంతలోనే పెళ్లి

by Chukka Sudharani |

ఒకప్పుడు హీరోయిన్‌గా, తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ నటి, రాజకీయ నేత ఖుష్బూ సుందర్ ఇంట త్వరలో పెళ్లి సందడి మొదలు కానుంది.

సినిమాల్లోకి అడుగు పెట్టబోతున్న సీనియర్ నటి కూతురు.. కానీ అంతలోనే పెళ్లి
X

దిశ, సినిమా: ఒకప్పుడు హీరోయిన్‌గా, తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ నటి, రాజకీయ నేత ఖుష్బూ సుందర్ ఇంట త్వరలో పెళ్లి సందడి మొదలు కానుంది. ఆమె పెద్ద కూతురు అవంతిక సుందర్ పెళ్లి ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది. ఈ మేరకు ఖుష్భూ ఆమె భర్త, డైరెక్టర్ సుందర్ సి తో కలిసి కూతురు అవంతిక, కాబోయే అల్లుడు శ్రవణ్ శ్రీనివాసన్‌ను తీసుకుని ప్రధాని నరేంద్ర మోడీని ఢిల్లీలో కలిశారు. ఈ సందర్భంగా తమ కుమార్తె వివాహానికి ఆహ్వానం అందజేసినట్లు ఖుష్బూ సోషల్ మీడియాలో వెల్లడించారు. ప్రధాని మోదీ కూడా కాబోయే దంపతులను ఆశీర్వదించినట్లు తెలిపారు. బిజీ షెడ్యూల్‌లో కూడా సమయం కేటాయించినందుకు ప్రధానికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే.. అవంతిక సుందర్ ఇప్పటికే సినిమాల్లో అడుగుపెడుతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రెండు, మూడు ప్రాజెక్టులు సైతం ఓకే చేసినట్లు తెలుస్తుండగా.. ఇలాంటి నేపథ్యంలో ఈ పెళ్లి వార్త ఇండస్ట్రీలో ఆసక్తికరంగా మారింది.

Next Story