- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చిక్కుల్లో నటి కల్పిక... మరో కేసు నమోదు
టాలీవుడ్ నటి కల్పిక గణేష్ కు ( Kalpika Ganesh) మరో ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. కల్పికపై మరో కేసు తాజాగా నమోదయింది.

దిశ, వెబ్ డెస్క్ : టాలీవుడ్ నటి కల్పిక గణేష్ కు ( Kalpika Ganesh) మరో ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. కల్పికపై మరో కేసు తాజాగా నమోదయింది. పలు సెక్షన్ల కింద నటి కల్పికపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ ( Hyderabad Cyber Crime) పోలీసులు కేసు నమోదు చేశారు. ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో ( Instagram account) అసభ్యకరమైన పదజాలం ఉపయోగించి... బండ బూతులు తిట్టింది అంటూ బాధితురాలు కీర్తన ( Keerthana) ఫిర్యాదు చేశారు.
ఆన్లైన్ అబ్యూజింగ్ తో (Online abuse ) పాటు వేధింపులకు కూడా పాల్పడిందని కల్పికపై సంచలన ఆరోపణలు చేసింది బాధితురాలు కీర్తన. సోషల్ మీడియాలో స్టేటస్ పెట్టుకోవడం తో పాటు బాధితురాలికి మెసేజ్ పెట్టి వల్గర్ గా కూడా మాట్లాడిందట కల్పిక. ఈ నేపథ్యంలోనే వాటన్నిటికీ సంబంధించిన స్క్రీన్ షాట్స్ అన్నిటిని పోలీసులకు ఇచ్చి పెట్టారు బాధితురాలు కీర్తన.
ఈ నేపథ్యంలోనే ఆధారాలన్నిటిని పరిశీలించి సినీ నటి కల్పిక పై మరో కేసు నమోదు చేశారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు. ఇప్పటికే ప్రిజం ( Prism Pub) క్లబ్ వ్యవహారం పై కూడా నటి కల్పికపై కేసు నమోదు అయిన సంగతి మనందరికీ తెలిసిందే. పుట్టినరోజు కేకు విషయంలో పబ్బు నిర్వాహకులు, నటి కల్పికా మధ్య వివాదం చోటుచేసుకుంది. ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ కావడంతో... కేసు బుక్ అయింది. ఇక లేటెస్ట్ గా మరో మహిళ ఫిర్యాదు చేయడంతో నటి కల్పిక పై కేసు నమోదు చేశారు పోలీసులు.






