Breaking: కరాటే కల్యాణి, తమన్నా సింహాద్రికి నటి హేమ లీగల్ నోటీసులు

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-04-06 13:37:22  IST  )

కరాటే కల్యాణి, తమన్నా సింహాద్రికి నటి హేమ లీగల్ నోటీసులు ఇచ్చారు....

Breaking: కరాటే కల్యాణి, తమన్నా సింహాద్రికి నటి హేమ లీగల్ నోటీసులు
X

దిశ, వెబ్ డెస్క్: నటి కరాటే కల్యాణి(Karate Kalyani), తమన్నా సింహాద్రి(Tamannaah Simhadri)కి నటి హేమ(Actress Hema) లీగల్ నోటీసులు(Legal notices) ఇచ్చారు. గతంలో తన పరువు, ప్రతిష్టను భంగం కలిగించారని ఆమె ఆరోపించారు. ఈ మేరకు చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు హేమ లీగల్ నోటీసులు పంపారు.

‘‘లాస్ట్ టైమ్ నేను ఓ ఇష్యూలో ఉన్నా. నాపై బుదర చల్లే ప్రయత్నం చేశారు. దానిపై నేను న్యాయస్థానాన్ని ఆశ్రయించా. నా పరువుకు నష్టం కలిగింది. ఇందులో భాగంగా నోటీసులు ఇచ్చా. మాటల్లో కాకుండా ఈసారి న్యాయస్థానానికి వెళ్లా. సినిమా వాళ్లను చాలా తేలిగ్గా తీసిపారేస్తున్నారు. నాలా మరొకరికి జరగకుండా ఉండాలనే ఈ నిర్ణయం తీసుకున్నా. ఇంకా కొంతమంది అడ్రస్‌లు తెలియలేదు. నాపై మీడియాలోనే అసభ్యంగా మాట్లాడారు. మా వ్యక్తిగత జీవితాలపై నోరుంది కదా అని మాట్లాడకూడదు. నిజాలైనా మాట్లాకూడదు. అలాంటిది చాలా ఈజీగా అబద్ధాలు చెప్పేశారు. నాపై వ్యక్తిగతంగా అసభ్యంగా మాట్లాడారు. ఆ వీడియోలన్నీ నెట్‌లో కొడితే వస్తున్నాయి. నేను తప్పు చేయకుండా బ్లేమ్ అయ్యా. ఇలాంటి వాటి నుంచి బయట పడేందుకే లీగల్ నోటీసులు ఇస్తున్నా.’’ అని నటి హేమ తెలిపారు.

Next Story