యాక్షన్ సీన్స్ చేయడంతో నా బేబీని కోల్పోయాను.. షాకింగ్ నిజాలు పంచుకున్న హీరోయిన్

by Ajay Maddhiboyina |

బాలీవుడ్ నటి గౌహర్ ఖాన్.. టీవీ సీరియల్స్‌తో గుర్తింపు తెచ్చుకుని తర్వాత మోడల్‌గా ఎదిగి.. ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో కూడా రాణిస్తుంది. ఈ క్రమంలోనే రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ నటి.. తను యాక్షన్ సీన్స్ చేయడంతో గర్భం కోల్పోయినట్లు చెప్పుకొచ్చింది.

యాక్షన్ సీన్స్ చేయడంతో నా బేబీని కోల్పోయాను.. షాకింగ్ నిజాలు పంచుకున్న హీరోయిన్
X

దిశ, సినిమా: బాలీవుడ్ నటి గౌహర్ ఖాన్.. టీవీ సీరియల్స్‌తో గుర్తింపు తెచ్చుకుని తర్వాత మోడల్‌గా ఎదిగి.. ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో కూడా రాణిస్తుంది. ఈ క్రమంలోనే రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ నటి.. తను యాక్షన్ సీన్స్ చేయడంతో గర్భం కోల్పోయినట్లు చెప్పుకొచ్చింది. ‘జైద్ దర్బార్‌తో వివాహం తర్వాత.. నా 36ఏళ్ల వయసులో పిల్లల్ని కనేందుకు ప్లాన్ చేసుకున్నాము. అయితే.. నాకు గర్భం దాల్చడానికి సంవత్సరం కంటే ఎక్కువ టైమ్ పట్టింది. ఆ టైమ్‌లో నేను అనుకున్నంత ఈజీగా కాలం సాగలేదు.

అయితే.. అంతా బాగానే ఉంది అనుకున్నాను. కానీ నేను నా బిడ్డను కోల్పోవాల్సి వస్తుంది అని నాతో పాటు ఎవరు ఊహించలేదు. నా బిడ్డను కోల్పోడానికి కేవలం నెల ముందుకు నేను ఒక సినిమా కోసం యాక్షన్ సన్నివేశాల్లో పాల్గొన్నాను. దాని కారణంగా ఇలా అయింది. ఆ అనుభవం తట్టుకోవడం నాకు చాలా కష్టంగా మారింది. దాని నుంచి కోలువడానికి నాకు చాలా సమయం పట్టింది. ఇక నేను మరో బిడ్డ జెహాన్‌కు జన్మనిచ్చాను. ఇప్పుడు నాకు 39 సంవత్సరాలు. ఇప్పుడు నేను మరొక బిడ్డను కావాలి అనుకున్నా... అది జరగదు’ అంటూ ఎమోషనల్ కామెంట్స్ చేసింది. వీడియో

Next Story