- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నాకు మూడ్ వస్తే బికినీ వేసుకుంటా.. నటి షాకింగ్ కామెంట్స్ వైరల్
డ్రెస్సింగ్ విషయంలో నటి గాయత్రి గుప్తా చేసిన కామెంట్స్ ప్రజెంట్ నెట్టింట సంచలనంగా మారాయి.

దిశ, సినిమా: యూట్యూబ్ షార్ట్ ఫిలిమ్స్‌తో గుర్తింపు తెచ్చుకున్న గాయత్రి గుప్తా.. పలు సినిమాల్లో నటిస్తూ వెండితెరపై కూడా మెరిసింది. ఎక్కువగా సోషల్ మీడియాలో షార్ట్ డ్రెస్సులు వేసుకుంటూ, బోల్డ్ కామెంట్స్‌తో వార్తల్లో నిలిచే ఈ నటి.. తాజాగా మరోసారి షాకింగ్ కామెంట్స్‌తో ట్రెండింగ్‌లోకి వచ్చింది. గాయాత్రి గుప్తా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఫస్ట్ టైమ్’. హేమంత్ ఇప్పనపల్లి కథ రాసుకుని తానే దర్శక నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రంతో సౌరబ్ ధింగ్ర హీరోగా పరిచయం అవుతుండగా.. బిగ్ బాస్ ఫేమ్ అఖిల్ సార్థక్ సెకండ్ లీడ్‌లో నటిస్తున్నారు. ఈ సినిమా మే 22 న రిలీజ్ ఉండగా.. ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఈవెంట్‌లో చీరలో దర్శనమిచ్చింది గాయత్రి. దీంతో ‘శివాజీ చేసిన కామెంట్సా, లేక సనాతన ధర్మాన్ని పాటిస్తన్నారా? చీరలోవచ్చారు అని యాంకర్ ప్రశ్నించగా.. ‘మీరు అడిగిన రెండు కరెక్ట్ కాదు. బికినీ వేసుకుంటా, శారీ కట్టుకుంటా. ఏది అనేది నా మూడ్ డిసైడ్ చేస్తుంది. అంతేకాని, శారీ కట్టుకుంటే పద్దతి ఉన్నట్లు, లేకపోతే లేనట్టు అని డ్రెస్ డిసైడ్ చెయ్యదు. ఏదైన మనం చూసే విధానం బట్టి ఉంటుంది. పచ్చకామెర్లు వచ్చినోడికి లేకం అంతా పచ్చగానే కనిపిస్తుంది’ అంటూ తనదైన శైలిలో ఆన్సర్ ఇచ్చింది ఈ నటి.






