- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎట్టకేలకు ప్రియుడిని పెళ్లాడిన నటి.. నెట్టింట వైరల్‌గా మారిన ఫొటోలు (పోస్ట్)
గత కొద్ది రోజుల నుంచి సినీ సెలబ్రిటీల పెళ్లిళ్లు చేసుకుంటూ బ్యాచ్‌లర్ లైఫ్‌కు గుడ్ బై చెప్పేస్తున్నారు.

దిశ, సినిమా: గత కొద్ది రోజుల నుంచి సినీ సెలబ్రిటీల పెళ్లిళ్లు చేసుకుంటూ బ్యాచ్‌లర్ లైఫ్‌కు గుడ్ బై చెప్పేస్తున్నారు. మరీ ముఖ్యంగా అంతా ప్రేమించిన వారినే తమ భాగస్వామిని చేసుకుంటూ పర్సనల్ లైఫ్‌పై ఫోకస్ పెడుతున్నారు. అయితే ఇటీవల నాగచైతన్య, శోభిత కూడా ప్రేమించి పెద్దలను ఒప్పించి మరీ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా, ఓ బుల్లితెర హీరోయిన్ తన ప్రియుడిని పెళ్లాడింది. మేఘనా శంకరప్ప(Meghna Shankarappa) నమ్మదే యువరాణి, కిన్నెరి వంటి సీరియల్స్‌లో కనిపించి మెప్పించింది.
అలాగే ఓ ప్రైవేట్ చాలన్ రియాలిటీ డ్యాన్స్ షోలోను పాల్గొని జడ్జెస్‌ను కూడా ఫిదా చేసింది. ప్రస్తుతం ‘సీతారామ’(Sitarama) సీరియల్‌లో నటిస్తోంది. ఈ క్రమంలో.. ఆమె తన ప్రియుడు జయంత్‌తో ఏడడుగులు వేసింది. వీరిద్దరి పెళ్లి ఫిబ్రవరి 9న అంగరంగ వైభవంగా జరిగింది. ఇక ఈ విషయాన్ని తెలుపుతూ మేఘనా తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఫొటోలు షేర్ చేస్తూ తన భర్తను పరిచయం చేసింది. ఇక ఈ పిక్స్ చూసిన వారంతా ఆమె కంగ్రాట్స్ చెబుతున్నారు. ఇక ఆమె భర్త జయంత్ (Jayanth)విషయానికొస్తే.. బెంగళూరుకు చెందిని అతడు ఇంజనీర్‌గా పని చేస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే మేఘనాతో పరిచయం కాస్త ప్రేమగా మారడంతో పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం వీరి వివాహానికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.






