- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీనియర్ నటి వారసురాలు ఇండస్ట్రీ ఎంట్రీ.. నా కూతురు రాణిస్తుందంటూ కామెంట్స్
by Chukka Sudharani |
సీనియర్ నటి దేవయాని కుమార్తె ప్రియాంక ఇండస్ట్రీ ఎంట్రీకి సిద్ధం అయింది.

X
దిశ, సినిమా: తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తనకంటూ స్పెషల్ గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ నటి దేవయాని వారసురాలు ఇండస్ట్రీ ఎంట్రీకి సిద్ధం అయింది. తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న చిత్రం ‘కోర్డు’. రోషన్, శ్రీదేవి జంటగా నటించిన ఈ మూవీ కోలీవుడ్‌లో రీమేక్ కాబోతున్నది. అక్కడ ‘రంజన్’ అనే పేరుతో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి త్యాగరాజన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీతో దేవయాని కుమార్తె ప్రియాంక కోలీవుడ్‌లో అరంగేట్రం చేస్తుంది. ఈ సందర్భంగా మూవీ లాంచ్ ఈవెంట్‌కు హాజరైన దేవయాని దీనిపై సంతోషం వ్యక్తం చేస్తూ.. తన కూతురికి ఈ అవకాశమిచ్చిన త్యాగరాజన్‌కు ధన్యవాదాలు తెలిపింది. అలాగే ఈ సినిమాతో తన కూతురు ఇండస్ట్రీ ఎంట్రీ సక్సెస్ అవ్వడంతో పాటు గొప్పగా రాణిస్తుందని ధీమా వ్యక్తం చేసింది దేవయాని.
Next Story






