నటి దీపికా పదుకొణెకి బిగ్ షాక్.. కల్కీ సినిమా నుంచి అవుట్

by Malleboina Mahesh |   (  Updated:2025-09-18 06:40:50  IST  )

ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న కల్కి సినిమాలో కీలక పాత్రలో నటించిన దీపికా పదుకొణె.. తన నటనతో మంచి మార్కులు కొట్టేసింది.

నటి దీపికా పదుకొణెకి బిగ్ షాక్.. కల్కీ సినిమా నుంచి అవుట్
X

దిశ, వెబ్ డెస్క్: ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న కల్కి (Kalki) సినిమాలో కీలక పాత్రలో నటించిన దీపికా పదుకొణె (Deepika Padukone.).. తన నటనతో మంచి మార్కులు కొట్టేసింది. షూటింగ్ సమయంలో ప్రెగ్నెన్సీ తో ఉన్న ఆమె.. అలాగే షూటింగ్ లో పాల్గోని విమర్శకులు ప్రశంసలను అందుకుంది. స్టోరీ ప్రకారం కల్కి పార్ట్ 2 (Kalki Part 2) లో ఆమె పాత్ర ప్రధానమైంది. కానీ ఎవరూ ఊహించని విధంగా.. దీపికా పదుకొణె కల్కీ సీక్వెల్ లో నటించడం లేదని చిత్ర యూనిట్ Cinema Unit() ప్రకటించింది. ఈ మేరకు వైజయంతి మూవీస్ సంస్థ (Vyjayanthi Movies) అధికారికంగా ఎక్స్ వేదికగా ఈ ప్రకటన చేసింది. ఆ ట్వీట్‌లో " “కల్కి 2898 ఏడి” సీక్వెల్‌లో నటి దీపికా పదుకొనే భాగస్వామ్యం ఉండబోమని అధికారికంగా ప్రకటించారు. మొదటి చిత్రం నిర్మాణంలో దీర్ఘకాల ప్రయాణం చేసినప్పటికీ, భాగస్వామ్యంలో అవసరమైన అనుసంధానం ఏర్పడలేదని స్పష్టం చేశారు. ఇలాంటి భారీ ప్రాజెక్ట్‌కి సంపూర్ణ నిబద్ధత అవసరమని, అదే ఈ నిర్ణయానికి కారణమని వారు తెలిపారు.

ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన కల్కీ 2898 AD 2024 జూన్ 27న విడుదలై ప్రపంచ వ్యాప్తంగా భారీ సక్సెస్ సాధించింది. ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ భారీ బడ్జెట్‌తో నిర్మించింది. సుమారు రూ.600 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం భారతదేశంలో అత్యధిక వ్యయంతో నిర్మితమైన సినిమాల్లో ఒకటి. భవిష్యత్తులో 2898 సంవత్సరంలో సాగే ఈ కథలో, వనరులను తన ఆధీనంలో ఉంచుకున్న “ద కాంప్లెక్స్” అనే శక్తివంతమైన వ్యవస్థను చూపించారు. ఇందులో అమితాబ్ బచ్చన్ “అశ్వత్థామ”గా, ప్రభాస్ “బైరవా”గా, దీపికా పడుకోన్ “సుమతి”గా, కమల్ హాసన్ ప్రతినాయకుడైన “సుప్రీం యాస్కిన్”గా నటించారు. విజువల్ ఎఫెక్ట్స్, సెట్ డిజైన్లు, భవిష్యత్తు లోకాన్ని ప్రతిబింబించిన నిర్మాణం ఈ చిత్రానికి విశేష ఆకర్షణగా నిలిచాయి. మొదటి భాగం భారీ విజయంతో రెండో పార్ట్ పై ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి.

Next Story