- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
47 ఏళ్ల వయసులో తల్లి అయిన నటి.. కంగ్రాట్స్ చెబుతున్న నెటిజన్లు (పోస్ట్)
తమిళ స్టార్ కమెడియన్ రెడిన్ కింగ్‌స్లీ(Redin Kingsley) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు.

దిశ, సినిమా: తమిళ స్టార్ కమెడియన్ రెడిన్ కింగ్‌స్లీ(Redin Kingsley) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. పలు చిత్రాల్లో నటించిన ఆయన ఫుల్ పాపులారిటీ దక్కించుకున్నారు. అలాగే పలు తెలుగు సినిమాల్లోనూ నటించి ప్రేక్షకులను అలరించారు. ప్రస్తుతం వరుస మూవీస్ చేస్తూ నటుడిగా ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. ఇక రెడిన్ పర్సనల్ లైఫ్ విషయానికొస్తే.. 2023లో ఆయన తమిళ టీవీ నటి సంగీత(sangeetha)ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. 45ఏళ్ల వయసులో వివాహం చేసుకుని అందరినీ షాక్‌కు గురి చేశాడు. అప్పట్లో ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా నిలిచింది. అయితే రెడిన్ సినిమాకంటే కూడా పెళ్లితోనే ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నాడు.
ఇక కొన్నాళ్ల క్రితం సంగీతం, రెడిన్ తల్లిదండ్రులు కాబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక అప్పటి నుంచి సంగీత (47) బేబీ బంప్ ఫొటోలు షేర్ చేస్తున్నారు. ఇక ఇటీవల శ్రీమంత్ చేసిన పిక్స్ నెట్టింట పెట్టడంతో అవి కాస్త వైరల్ అయ్యాయి. ఇదిలా ఉంటే.. తాజాగా, సంగీత పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని తెలుపుతూ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ ఆసక్తికర పోస్ట్ పెట్టింది. సంగీత్, రెడిన్ జంటకు కూతురు పుట్టింది. ఇక ఆమెను రెడిన్ కింగ్‌స్లీ ఎత్తుకున్న ఫొటో షేర్ చేస్తూ.. ‘‘మీ అందరి ఆశీస్సులకు ధన్యవాదాలు. ప్రిన్సెస్ పుట్టింది’’ అనే క్యాప్షన్ జత చేసింది. ఇక అది చూసిన వారంతా కంగ్రాట్స్ చెబుతున్నారు.






