నాతో ఏం చేయాలనుకుంటున్నారో నీచంగా కామెంట్స్ చేస్తుంటారు.. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి: అయేషా ఖాన్

by Chukka Sudharani |   (  Updated:2026-03-04 11:54:18  IST  )

సోషల్ మీడియా వేదికగా నాకు నిత్యం అసభ్యకర కామెంట్స్‌తో పాటు రేప్ బెదిరింపులు కూడా వస్తున్నాయి అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది నటి అయేషా ఖాన్.

నాతో ఏం చేయాలనుకుంటున్నారో నీచంగా కామెంట్స్ చేస్తుంటారు.. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి: అయేషా ఖాన్
X

దిశ, సినిమా: సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ పెట్టలాంటే వంద సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. కామెంట్ బాక్స్‌లో వచ్చే అసభ్యకరమైన రాతలు నన్ను అంతలా బాధపెడుతున్నాయి అంటూ ఆవేదన వ్యక్తం చేసింది నటి అయేషా ఖాన్. ‘వీ ది ఉమెన్’ ఈవెంట్‌లో పాల్గొన్న ఆమె.. నెట్టింట తనపై జరుగుతున్న బాడీ షేమింగ్, ఎదురవుతున్న రేప్ బెదిరింపుల‌పై షాకింగ్ కామెంట్స్ చేసింది. ‘నేను సింపుల్ టాప్స్ వేసుకున్నా, స్కర్ట్స్ వేసుకున్నా.. జనం ఎలా రియాక్ట్ అవుతారో అని చాలా భయంగా ఉంటుంది. అందుకే ఏదైనా ఫొటో షేర్ చేయాలి అనుకునే ముందు ఒకటికి వందసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకుంటాను. అసలు కొన్ని సార్లు నా పోస్టుకి వచ్చే కామెంట్స్ చూస్తే పోస్ట్ చేయడమే మానేయాలనిపిస్తుంది. అంతే కాదు ప్రతిరోజు నాకు రేప్ బెదిరింపులు వస్తున్నాయి. నాతో ఏం చేయాలనుకుంటున్నారో నీచంగా కామెంట్స్ చేస్తుంటారు. ఒకవేళ నేను సెలబ్రిటీని కాకపోతే.. ఆ బెదిరింపులు నిజం అయిపోయేవేమో అని భయమేస్తోంది. ఇవి కేవలం కామెంట్స్ కావు.. ఇది నా వ్యక్తిగత భద్రతకు సంబంధించిన విషయం. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నేను కోరుకుంటున్నా’ అంటూ ఆవేదన వ్యక్తం చేసింది అయేషా.

Next Story