aishwaryarajesh: కామాఖ్యమందిర్‌ను దర్శించుకున్న నటి ఐశ్వర్యరాజేష్

by Kodari Anjali |

తెలుగు హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.

aishwaryarajesh: కామాఖ్యమందిర్‌ను దర్శించుకున్న నటి ఐశ్వర్యరాజేష్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఈ బ్యూటీ తెలుగు చిత్రాలతో పాటు తమిళం, మలయాళం సినిమాల్లో కూడా కీలక పాత్రల్లో అవకాశాలు దక్కించుకుంటుంది. ఐశ్వర్య అద్భుతమైన నటనకు నాలుగు సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్, ఒక ఫిలింఫేర్ సౌత్ అవార్డు, ఒక తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డు కూడా సొంతం చేసుకుంది. వరల్డ్ స్పోర్ట్స్ డ్రామా కౌస్య కృష్ణమూర్తి, ఫేమస్ రిపబ్లిక్ వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది.

ఈ ఏడాది సంక్రాంతి పండగకు సంక్రాతికి వస్తున్నాం చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీలో ఐశ్వర్య అద్భుతంగా నటించి ప్రేక్షకుల మనసు దోచేసిందనడంలో అతిశయోక్తిలేదు. టాలీవుడ్ సీనియర్ నటుడు వెంకటేష్ అండ్ మీనాక్షి చౌదరి కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించింది.

ఇకపోతే ఈ బ్యూటీ సోషల్ మీడియాలోని అభిమానులతో ఎప్పుడు టచ్‌లో ఉంటుంది. వెకేషన్స్, సినిమా షూటింగ్‌లు, లేటెస్ట్ ఫొటో షూట్లు, వృత్తిపర, వ్యక్తిగత విషయాల్ని ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటుంది. అయితే తాజాగా ఐశ్వర్య రాజేష్ నెట్టింట ఓ పోస్ట్ పంచుకుంది. జై మా కామాఖ్య మందిర్, కామాఖ్య దేవాలయాన్ని సందర్శించుకున్నట్లు సోషల్ మీడియా పోస్ట్ ద్వారా తెలిపింది. జై మా కామాఖ్య.. నిజంగా ధన్యురాలుని అని క్యాప్షన్ జోడిస్తూ పలు ఫొటోలు కూడా పంచుకుంది.

Next Story