Aishwarya Rai Bachchan : నటి ఐశ్వర్యారాయ్ కారుకు ప్రమాదం

by Muthe.Rajitha |

మాజీ మిస్ వరల్డ్, బాలీవుడ్(Bollywood) టాప్ యాక్టర్ ఐశ్వర్యారాయ్ బచ్చన్‌(Aishwarya Rai Bachchan) కారు ప్రమాదానికి(Car Accident) గురైంది.

Aishwarya Rai Bachchan : నటి ఐశ్వర్యారాయ్ కారుకు ప్రమాదం
X

దిశ, వెబ్ డెస్క్ : మాజీ మిస్ వరల్డ్, బాలీవుడ్(Bollywood) టాప్ యాక్టర్ ఐశ్వర్యారాయ్ బచ్చన్‌(Aishwarya Rai Bachchan) కారు ప్రమాదానికి(Car Accident) గురైంది. బుధవారం సాయంత్రం ముంబై(Mumbai)లోని జుహు(Juhu) ప్రాంతంలో ఐశ్వర్యారాయ్ కారులో ఉండగా.. వెనుక నుంచి బస్సు బలంగా ఢీకొట్టింది. ఐశ్వర్యాకు ఎం సిల్వర్ టొయోటా వెల్‌ఫైర్ కారులో ఉండగా, బస్సు వెనుక నుంచి ఢీకొట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటన తర్వాత పెద్ద సంఖ్యలో జనం గుమిగూడారు. అయితే ఐశ్వర్యాకు ఎంతో ఇష్టమైన సిల్వర్ టొయోటా వెల్‌ఫైర్ కారుకు వెనుకభాగం దెబ్బతిన్నది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు.

అనంతరం ఆ కారును అక్కడి నుంచి పంపించి వేశారు. అయితే ఈ ప్రమాదంలో ఐశ్వర్యాకు గాయాలు అయ్యాయా లేదా అనేదానిపై భిన్న సమాచారం బయటికి వచ్చింది. ప్రత్యక్ష సాక్షులు చెప్పిన దాని ప్రకారం ప్రమాద సమయంలో ఐష్ కారులో ఉన్నట్టు తెలియగా.. ఆమె సన్నిహితులు మాత్రం ఆ సమయంలో ఐష్ కారులో లేరని వెల్లడించారు. ప్రమాదంపై ఆమె అభిమానులు తీవ్ర ఆందోళనకు గురవుతుండగా.. ఇంతవరకు ఐష్ నుంచి గాని, ఆమె కుటుంబ సభ్యుల నుంచి గాని ఎలాంటి అధికారిక సమాచారం వెలువడలేదు.

Next Story