- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గ్రాండ్‌గా నటి అభినయ రిసెప్షన్.. ఆకట్టుకుంటోన్న నూతన దంపతుల ఫొటోలు
టాలీవుడ్ నటి అభినయ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ నటి అభినయ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఈ నటి ఇటీవలే వివాహబంధంలోకి అడుగుపెట్టింది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, శంభో శివ శంభో వంటి సినిమాల్లో అద్భుతంగా నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది నటి అభినయ. ప్రస్తుతం తెలుగుతో పాటు కన్నడ, తమిళం, మలయాళంలో కూడా నటిస్తూ తన టాలెంట్‌ను బయటపెడుతోంది. మలయాళం మూవీ అయిన మార్క్ ఆంటోని సినిమాలో విశాల్ సరసన నటించి.. బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది.
అయితే అభినయ ఇటీవలే ప్రియుడు వేగేశ్న కార్తీక్‌ను వివాహం చేసుకుంది. గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట పెద్దల సమక్షంలో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి సన్నిహితులు, బంధుమిత్రులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. తాజాగా వీరు రిసెప్షన్ వేడక గ్రాండ్‌గా జరుపుకున్నట్లు తెలుస్తోంది. పలువురు సినీ ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను నటి అభినయ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది.






