నటుడికి స్పెషల్ విషెస్ చెప్తూ ‘ఎంపురాన్-2’ మూవీ లుక్ షేర్ చేసిన మోహన్ లాల్

by Mallepaka Hamsa |   (  Updated:2024-12-17 05:15:55  IST  )

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్(Mohanlal), పృథ్వీరాజ్ సుకుమారన్(Prithviraj Sukumaran) కాంబోలో వచ్చిన చిత్రం ‘లూసిఫర్: ఎంపురాన్’.

నటుడికి స్పెషల్ విషెస్ చెప్తూ ‘ఎంపురాన్-2’ మూవీ లుక్ షేర్ చేసిన మోహన్ లాల్
X

దిశ, సినిమా: మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్(Mohanlal), పృథ్వీరాజ్ సుకుమారన్(Prithviraj Sukumaran) కాంబోలో వచ్చిన చిత్రం ‘లూసిఫర్: ఎంపురాన్’. అయితే ఇది 2019లో విడుదలై బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌ విజయాన్ని సాధించింది. మంజు వారియర్. వివేక్ ఒబెరాయ్, టోవినో థామస్(Tovino Thomas) ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ తెలుగులో ‘గాడ్ ఫాదర్’(Godfather) పేరుతో విడుదల మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈ సినిమాకు సిక్వెల్‌గా ‘లూసిఫర్: ఎంపురాన్-2’(Lucifer: Empuran-2) రాబోతుండటంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

దీనికి పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహిస్తుండగా.. మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. దీనిని లైకా ప్రొడక్షన్స్(Lyca Productions) భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. అయితే ‘లూసిఫర్: ఎంపురాన్-2’ వచ్చే ఏడాది మార్చి 27న తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళంలో విడుదల కానుంది. ఈ క్రమంలో.. మూవీ మేకర్స్ ఇందులోని పాత్రలు రివీల్ చేస్తూ హైప్ పెంచుతున్నారు. తాజాగా, మోహన్ లాల్ సోషల్ మీడియా ద్వారా ఓ ఆసక్తికర పోస్టర్ వదిలారు. నటుడు ఇంద్రజిత్ పుట్టినరోజు కావడంతో ఆయన గోవర్ధన్(Govardhan)పాత్రలో నటిస్తున్నట్లు తెలుపుతూ లుక్ రివీల్ చేశారు.

Next Story