- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కన్నప్పలో ప్రభాస్ ఎంట్రీ అప్పుడే.. ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో రివీల్ చేసిన నటుడు.. ఆల్మోస్ట్ తలపట్టుకున్న మంచు విష్ణు!
మంచు విష్ణు ప్రతిష్టాత్మక సినిమా కన్నప్ప(Kannappa Movie) ప్రీరిలీజ్ ఫంక్షన్ ఇవాళ హైదరాబాద్ వేదికగా గ్రాండ్‌గా జరిగింది.

దిశ, వెబ్‌డెస్క్: మంచు విష్ణు ప్రతిష్టాత్మక సినిమా కన్నప్ప(Kannappa Movie) ప్రీరిలీజ్ ఫంక్షన్ ఇవాళ హైదరాబాద్ వేదికగా గ్రాండ్‌గా జరిగింది. పలువురు సినీ ప్రముఖులు ఈ ఈవెంట్‌లో సందడి చేశారు. ఈ సందర్భంగా నటుడు బీవీఎస్ రవి(BVS Ravi) మాట్లాడుతూ సినిమాలో ప్రభాస్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చారు. ‘ఇంటర్వెల్ తర్వాత 15వ నిమిషంలో ప్రభాస్(Prabhas) ఎంట్రీ ఉంటుంది. అక్కడినుంచి సినిమా మామూలుగా ఉండదు. మొత్తం 27 నిమిషాల పాటు ప్రభాస్ క్యారెక్టర్ ఉంటుంది. ప్రభాస్, విష్ణు, మోహన్ బాబు, అక్షయ్ కుమార్, మోహన్ లాల్ ప్రతీ ఒక్కరు అదరగొట్టేశారు. విష్ణు పాత్ర కోసం ప్రాణం పెట్టారు. ఈ సినిమా తెలుగు ఇండస్ట్రీలోనే గొప్ప విజయం సాధిస్తుంది. సినిమాపై అందరికీ నమ్మకం, కాన్ఫిడెంట్ వచ్చేసింది’ అని బీవీఎస్ రవి చెప్పుకొచ్చారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
కాగా, కన్నప్ప మూవీ జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా ఐదు భాషల్లో విడుదల కాబోతోంది. ఈ చిత్రానికి బాలీవుడ్ దర్శకుడు ముఖేష్ కుమార్ దర్శకత్వం వహిస్తుండగా.. ప్రీతి ముకుందన్, మోహన్ బాబు, శరత్ కుమార్, మధు, ముఖేష్ రిషితో పాటు మోహన్‌లాల్, ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ వంటి స్టార్స్ ఈ సినిమాలో కీలకపాత్ర పోషిస్తున్నారు. దాదాపు రూ.100 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అంతేకాకుండా ఈ సినిమాకు స్వయంగా మంచు విష్ణు కథ, స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. వీడియో






