రష్మికతో నిశ్చితార్థం వార్తలు.. పుట్టపర్తిలో విజయ్ దేవరకొండ సందడి.. బాబా ఆశీర్వాదం కోసమేనా..?

by Ramesh Naini |   (  Updated:2025-10-05 13:59:50  IST  )

ప్రముఖ సినీ నటుడు విజయ్ దేవరకొండ పుట్టపర్తిని సందర్శించి సందడి చేశారు.

రష్మికతో నిశ్చితార్థం వార్తలు.. పుట్టపర్తిలో విజయ్ దేవరకొండ సందడి.. బాబా ఆశీర్వాదం కోసమేనా..?
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రముఖ సినీ నటుడు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) పుట్టపర్తిని సందర్శించి సందడి చేశారు. ఆదివారం శ్రీ సత్యసాయి జిల్లాలోని (Puttaparthi) పుట్టపర్తి సత్యసాయి మహాసమాధిని విజయ్ దేవరకొండ దర్శించుకున్నారు. ఈ మేరకు ఆయన ఆయన పుట్టపర్తిలోని శాంతి భవన్ అతిథి గృహం వద్ద ట్రస్ట్ సభ్యులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సత్యసాయి జిల్లా టీడీపీ జిల్లా కార్యదర్శి, పులివెందుల నియోజకవర్గం అబ్జర్వర్ సామకోటి ఆది నారాయణ ఆయనకు బాబా చిత్రపటాన్ని బహుకరించారు.

కాగా, అక్టోబర్ 3న ప్రముఖ నటి రష్మిక మందన్న(Rashmika Mandanna)తో నిశ్చితార్థం చేసుకున్నారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సత్యసాయి బాబా (Sathya Sai Baba) ఆశీర్వాదం తీసుకోవడానికి పుట్టపర్తికి వెళ్లారని సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అలాగే నటి రష్మిక మందన్నతో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విజయ్ దేవరకొండ వివాహానికి ముహూర్తం కుదిరినట్లు ప్రచారం జరుగుతోంది. కాగా, శ్రీ సత్యసాయి పాఠశాలలోనే విజయ్ చదువుకున్న విషయం తెలిసిందే. వీడియో ఇదే..

Next Story