- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
క్షమాపణ చెప్పిన నటుడు శ్రీకాంత్ అయ్యంగార్.. సోషల్ మీడియా పోస్టుపై వివరణ
మహాత్మ గాంధీ(Mahatma Gandhi)పై నటుడు శ్రీకాంత్ అయ్యంగార్(Srikanth Iyengar) చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.

దిశ, వెబ్‌డెస్క్: మహాత్మ గాంధీ(Mahatma Gandhi)పై నటుడు శ్రీకాంత్ అయ్యంగార్(Srikanth Iyengar) చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. పార్టీలకు అతీతంగా ఆయన వ్యాఖ్యలపై స్పందిస్తూ రెచ్చిపోతున్నారు. మరోవైపు శ్రీకాంత్ అయ్యంగార్‌పై వరుస కేసులు నమోదు చేసుకున్నారు. ఈ అంశాన్ని తెలంగాణ కాంగ్రెస్ కూడా సీరియస్‌గా తీసుకున్నది. ఆదివారం ఉదయం ‘మా’ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణును ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కలిశారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన శ్రీకాంత్ అయ్యంగార్ ‘మా’ సభ్యత్వం రద్దు చేయడంతో పాటు ఆయనపై చర్యలు తీసుకోవాలని కంప్లైంట్ చేశారు. ఈ వరుస పరిణామాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న శ్రీకాంత్ తాజాగా స్పందించారు. ఎట్టకేలకు సారీ చెప్పారు. ఇటీవల తాను పెట్టిన సోషల్ మీడియా పోస్టులపై కూడా వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యలు వల్ల చాలామంది మనోభవాలు దెబ్బతిన్నాయని తెలిసింది. అందుకే అందరికీ క్షమాపణ చెబుతున్నా అని పేర్కొన్నారు. భవిష్యత్‌లో ఇలాంటివి మళ్లీ రిపీట్ కాకుండా జగ్రత్తలు తీసుకుంటానని అన్నారు. అందరం కలిసి దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం అవుదామని పిలుపునిచ్చారు. శ్రీకాంత్ వీడియో






