Sonu Sood : మరోసారి గొప్ప మనసు చాటుకున్న సోనూసూద్..

by Ramesh Naini |

ప్రముఖ నటుడు సోనూసూద్ (Sonu Sood) మరోసారి గొప్ప మనసు చాటుకున్నారు.

Sonu Sood : మరోసారి గొప్ప మనసు చాటుకున్న సోనూసూద్..
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రముఖ నటుడు సోనూసూద్ (Sonu Sood) మరోసారి గొప్ప మనసు చాటుకున్నారు. వృద్ధుల కోసం ఆశ్రమం ఏర్పాటు చేస్తున్నట్లు సోనూసూద్ తాజాగా ప్రకటించారు. జూలై 30న తన పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్న ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ వృద్ధాశ్రమంలో దాదాపు 500 మంది నిరాశ్రయ వృద్ధులకు కొత్త జీవితాన్ని అందించేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. ఈ ఆశ్రమంలో వృద్ధుల కోసం వైద్యం తదితర సదుపాయాలు కల్పించేలా ఏర్పాటు చేస్తున్నారు. కాగా, కరోనా సమయంలో ఎంతో మందికి సాయపడి సోనూసూద్ రియల్ హీరో అనిపించుకున్న సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఆయన దేశవ్యాప్తంగా ఎంతో మంది ప్రశంసలు ఆయన అందుకున్నారు. సోనూసూద్ సామాజిక సేవలు చేయడంలో ముందు వరుసలో ఉంటారు. వైద్య సహాయం, చిరువ్యాపారులకు ఆర్ధిక సాయం, విద్యార్ధులకు స్కాలర్‌షిప్స్ వంటి ఎన్నో కార్యక్రమాలు తన సొంత ట్రస్ట్ ద్వారా అనేక మందిని ఆదుకున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన మిస్ వరల్డ్ 2025ఫైనల్స్ వేడుకల్లో ఆయనకు ప్రతిష్టాత్మక మానవతావాది అవార్డు వచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సోనూసూద్ 52 వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా వృద్ధాశ్రమం ఏర్పాటు చేసి వారికి సేవ చేయాలని ప్రాజెక్టు ప్రారంభించారు.

Next Story