- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Shivaji: సామాన్లు కనపడేలా డ్రెస్ వేసుకోవడం అందం కాదు..!
నటుడు శివాజీ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్లు వేసుకునే డ్రెస్సులపై కామెంట్స్ చేసి,

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడు శివాజీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అప్పట్లో హీరోగా ఎన్నో సినిమాలు చేసిన శివాజీ, రీ-ఎంట్రీలో సహాయక పాత్రలు చేస్తూ దూసుకెళుతున్నారు. అంతేకాదు బిగ్ బాస్ షోలో మెరిసిన శివాజీ, ఇప్పుడు దండోరా అనే డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాతో వస్తున్నారు. ఈ సినిమాకు మురళీ కాంత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో ఓ స్పెషల్ రోల్ శివాజీ చేస్తున్నారు. నవదీప్, నందు, బిందు మాధవి, రవి కృష్ణ ప్రత్యేక పాత్రలో కనిపిస్తున్నారు. డిసెంబర్ 25వ తేదీన థియేటర్లలో ఈ మూవీ రిలీజ్ కానుంది.
ఈ నేపథ్యంలోనే ప్రమోషన్ లో భాగంగా స్పెషల్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ సందర్భంగా నటుడు శివాజీ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్లు వేసుకునే డ్రెస్సులపై కామెంట్స్ చేసి, వివాదానికి తెర లేపారు. సామాన్లు కనిపించేలా డ్రెస్ వేసుకోవడం అందం కాదంటూ ఫైర్ అయ్యారు. చీరకట్టు, సాంప్రదాయ దుస్తులు మాత్రమే అమ్మాయిలు కనిపించాలని స్పీచ్ ఇచ్చారు.
ఆడదానిలో అమ్మను చూసుకుంటామని, అలాంటి వాళ్లు చీరకట్టులో కనిపిస్తే ప్రకృతికి అందం వస్తుందని వివరించారు. అప్పట్లో సౌందర్య, సావిత్రి లాంటివారు చీరకట్టులో ఇండస్ట్రీని షేక్ చేసినట్లు గుర్తు చేశారు. ఇప్పటి తరంలో రష్మిక లాంటి హీరోయిన్లు పొట్టి డ్రెస్సులు వేసుకోకుండానే సక్సెస్ అవుతున్నట్లు హితువు పలికారు. ఇకనైనా పొట్టి బట్టలు కాకుండా, సాంప్రదాయ దుస్తుల్లో కనిపించాలని సూచనలు చేశారు శివాజీ. తన మాటలు కొంతమందిని నొప్పిస్తాయి, కానీ వాటిని ఫాలో అవుతే బాగుంటుందని కోరారు. క్లిక్






