- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సమంత, నిధి అగర్వాల్ బాధచూసే అలా మాట్లాడా.. మరోసారి శివాజీ కీలక వ్యాఖ్యలు
దండోరా సినిమా ఈవెంట్‌లో చేసిన వ్యాఖ్యలపై నటుడు శివాజీ మరోసారి క్షమాపణలు చెప్పారు. ఆ రెండు పదాలు వాడినందుకు తనను క్షమించాలని అన్నారు.

దిశ, వెబ్ డెస్క్: దండోరా సినిమా ఈవెంట్‌లో చేసిన వ్యాఖ్యలపై నటుడు శివాజీ మరోసారి క్షమాపణలు చెప్పారు. ఆ రెండు పదాలు వాడినందుకు తనను క్షమించాలని అన్నారు. రెండు అన్ పార్లమెంటరీ పదాలు దొర్లాయని వాటికి తాను క్షమాపణలు కోరుతున్నానని చెప్పారు. ఇప్పటికే తాను క్షమాపణలు చెబుతూ వీడియో రిలీజ్ చేశానని అన్నారు. ముఖ్యంగా తాను క్షమాపణలు చెప్పాల్సింది ఆ రోజు స్టేజిపై నిలుచుకున్న నటీమణులకు అని ఆవేదన వ్యక్తం చేశారు. తప్పు తనవైపు ఉంది కాబట్టి ఎన్నిసార్లు అయినా క్షమాపణలు చెబుతానని అన్నారు.
ఆ వ్యాఖ్యలకి తన భార్య, పిల్లలు కూడా బాధ పడుతున్నారని చెప్పారు. గతంలో తానెప్పుడూ అలా నియంత్రణ కోల్పోయి మాట్లాడలేదని చెప్పారు. నిధి అగర్వాల్, సమంత పడ్డ వేదన తన మైండ్‌లో నుండి పోలేదని.. అందుకే అలా మాట్లాడానని అన్నారు. తాను ఎవరినీ ఈ డ్రెస్ వేసుకోండి, ఆ డ్రెస్ వేసుకోండి అని చెప్పలేదని అన్నారు. తాను నటించిన హీరోయిన్లతో ఎప్పుడూ మిస్ బిహేవ్ చేయాలేదని అన్నారు. ౩౦ఏళ్ళ నుండి తాను ఇక్కడ ఉంటున్నానని కానీ ఎప్పుడూ ఇలా జరగలేదన్నారు. ఆ రెండు పదాలు ఎందుకు వచ్చాయో తనకు ఇప్పటికీ నమ్మబుద్ధి కావడం లేదన్నారు. అందరూ ఎందుకో చిన్మయికి, అనసూయకి ట్యాగ్ చేస్తున్నారు.. ఎందుకు ట్యాగ్ చేస్తున్నారో అర్థం కాలేదని వ్యాఖ్యానించారు. తన ఇంటెన్షన్ బ్యడ్ కాదని అనసూయ ఈ ఇష్యూలోకి ఎందుకొచ్చారు? అని ప్రశ్నించారు. మహిళా కమిషన్ ముందు తప్పకుండా హాజరవుతానని కర్మ ఎవరినీ వదిలిపెట్టదని అన్నారు. తాను ఎప్పుడు సెట్ అవుతానో తెలియదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదిలా ఉంటే శివాజీ దండోరా ఈవెంట్ లో సామాన్లు, దొం*ము* అంటూ మాట్లాడారు. అయితే శివాజీ తన స్పీచ్ లో హీరోయిన్లు పొట్టిబట్టలు వేసుకోవద్దని సైతం హితవు పలికారు. దానిపై కూడా కొంతమంది సెలబ్రెటీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహిళలు ఏం వేసుకోవాలో వేసుకోవద్దో చెప్పే హక్కు శివాజీకి లేదని మండిపడుతున్నారు. కానీ శివాజీ మాత్రం తాను మాట్లాడిన అన్ పార్లమెంటరీ పదాలకు మాత్రమే క్షమాపణలు చెబుతున్నారు. దీంతో ఈ వివాదానికి ఇక్కడితో పుల్ స్టాప్ పడేలా లేదని పలువురు భావిస్తున్నారు.






