మేము సినిమాల కోసమే ముఖానికి రంగులు వేసుకుంటాము.. ప్రజల విషయంలో కాదు: శివరాజ్ కుమార్

by Chukka Sudharani |

ప్రజలకు సేవ చేసే విషయంపై తాజా ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు కన్నడ స్టార్ శివరాజ్ కుమార్.

మేము సినిమాల కోసమే ముఖానికి రంగులు వేసుకుంటాము.. ప్రజల విషయంలో కాదు: శివరాజ్ కుమార్
X

దిశ, సినిమా: కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ త్వరలో ‘పెద్ది’ చిత్రంతో ప్రేక్షకుల మందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, దర్శకుడు బుచ్చిబాబు సనా కాంబినేషన్‌లో తెరకెక్కిన ఈ మూవీ జూన్-4న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధం అవుతున్నది. ఇక ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శివరాజ్ కుమార్ ఉపేంద్రపై ఆసక్తికర కామెంట్స్ చేశాడు. తనకు రాజకీయాల్లోకి వెళ్లాలనే ఆసక్తి లేదని తెలిపిన ఆయన నటుడు ఉపేంద్ర సీఎం అవుతాడా అనే ప్రశ్నపై స్పందిస్తూ.. ‘నిజంగా ఉపేంద్రకు రాజకీయాలపై ఇంట్రెస్ట్ ఉంటే అది మంచి విషమయే. ఇటీవల తమిళ నటుడు విజయ్ సీఎం అవ్వడం చూశాం. ప్రజలంతా ఆయనుకు ఎంత మద్దతు ఇచ్చారో చూశాం. అలా కర్ణాటకలోఉపేంద్రకు ఎందుకు మద్దతు ఇవ్వకూడదు?. మేము సినిమాల కోసం మాత్రమే ముఖానికి రంగులు వేసుకుంటాం. ప్రజలకు సేవ చేసే విషయంలో ఎలాంటి రంగులు మార్చకుండా చేస్తాం. వారి విషయంలో చాలా స్పష్టంగా ఉంటాము. ఇక నా విషయానికి వస్తే నన్ను ఎవరు నిందించలేరు. ఎందుకంటే నేను ఇప్పటి వరకు ప్రజల కోసం ఎంత చేశానో అందరికీ తెలుసు. అయితే.. చేసే ప్రతి మంచి పని పేపర్లో రాకపోవచ్చు. కానీ ప్రజలకు తెలుసు. వాళ్ల హృదయమే సమాధానం ఇస్తుంది’ అంటూ చెప్పుకొచ్చాడు.

Next Story