కల్కి స్టోరీ రాస్తే పాసైపోతామని తెలిస్తే ఎప్పుడో రాసేవాడిని.. ఆకట్టుకుంటున్న టీజర్

by Chukka Sudharani |

యంగ్ నటుడు శివ కందుకూరి హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ ‘చాయ్ వాలా’.

కల్కి స్టోరీ రాస్తే పాసైపోతామని తెలిస్తే ఎప్పుడో రాసేవాడిని.. ఆకట్టుకుంటున్న టీజర్
X

దిశ, సినిమా: యంగ్ నటుడు శివ కందుకూరి హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ ‘చాయ్ వాలా’. ప్రమోద్ హర్ష దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని హర్షిక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాధా విజయలక్ష్మి, వెంకట్ ఆర్. పాపుడిప్పు భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఇందులో నుంచి వచ్చిన అప్డేట్స్ ఆకట్టుకోగా.. తాజాగా టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్.

‘నా చాయ్ విలువ రూ. 15.. అంతకన్న ఒక్క రూపాయి ఎక్కువ తీసుకున్నా.. నా విలువ పడిపోతుంది’ అంటూ రాజీవ్ కనకాల డైలాగ్‌తో స్టార్ట్ అయిన ఈ టీజర్‌లో.. ఇంతకి నీ సుపుత్రుడు ఎన్నింటికి వచ్చాడు అనే డైలాగ్‌తో హీరో శివ ఎంట్రీ ఉంటుంది. ఇక ‘ప్రతీ పేజీలో కల్కి సినిమా స్టోరీ రాస్తే పాసైపోతామని తెలిస్తే.. ఎప్పుడో పాస్ అయ్యే వాళ్లం కదరా’ అంటూ శివ చెప్పే డైలాగ్స్ సినిమాపై మరింత ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. ఫైనల్‌గా ఈ మూవీ యూత్ ఫుల్ అండ్ ఫ్యామిలీ డ్రామాగా తెలుస్తుంది. ప్రస్తుతం ఈ టీజర్ నెట్టింట ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. లింక్

Next Story