- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పెళ్లి లేకుండా పిల్లల్ని కనడానికి నేను సిద్ధం.. కూతురి కామెంట్స్‌కు నటుడు సత్యరాజ్ మద్దతు
వివాహ వ్యవస్థపై గౌరవం ఉంది కానీ, వ్యక్తిగతంగా దానిని నమ్మను అంటుంది దివ్య సత్యరాజ్.

దిశ, సినిమా: వివాహ వ్యవస్థపై గౌరవం ఉంది కానీ, వ్యక్తిగతంగా దానిని నమ్మను అంటుంది దివ్య సత్యరాజ్. సినీ పరిశ్రమలో గుర్తింపు పొందిన నటుడు సత్యరాజ్ కుమార్తె, న్యూట్రిషనిస్ట్ అండ్ డీఎంకే నాయకురాలు దివ్య సత్యరాజ్ పెళ్లి బంధంపై చేసిన కామెంట్స్ ప్రజెంట్ నెట్టింట సంచలనంగా మారాయి. ‘కేవలం మంగళసూత్రం కట్టుకోవడం, ఉంగరాలు మార్చుకోవడం వల్ల ఇద్దరి మధ్య బంధం బలపడుతుందని నేను అనుకోను. ఇద్దరు వ్యక్తులు పరస్పర అంగీకారంతో, ప్రేమతో కలిసి జీవించగలరు. దాని కోసం, 'వివాహం' అనే సమాజపు ముద్ర లేదా ధృవపత్రం అవసరం లేదు’ అంటూ తెలుపగా వివాదాస్పదంగా మారింది. నెట్టింట నెగిటివ్ ట్రోల్స్ స్టార్ట్ అయ్యాయి. దీనిపై తన త్రండి నటుడు సత్యరాజ్ స్పందిస్తూ.. ‘నేను పెరియార్ సిద్ధాంతాలను విశ్వసిస్తాను. కులమతాలు, మూఢనమ్మకాలకు వ్యతిరేకం. వివాహం ఒక వ్యక్తిగత ఎంపిక మాత్రమే, ఆధునిక వైద్య సాంకేతికతలతో పెళ్లి లేకుండానే సంతానం పొందే అవకాశాలు ఉన్నాయి’ అంటూ తన కుమార్తె ఆలోచనలను గౌరవిస్తు మద్దతుగా నిలిచాడు.






