రిజెక్షన్స్ ఎదురైనప్పుడు గుండె బరువెక్కిపోతుంది.. షాకింగ్‌గా స్టార్ డైరెక్టర్ కామెంట్స్

by Chukka Sudharani |

రిజెక్షన్స్ ఎదురైనప్పుడు గుండె బరువెక్కిపోతుంది. కానీ వాటిని స్వీకరించినప్పుడు మాత్రమే జీవితం ముందకు సాగుతుంది అని చెప్పుకొచ్చాడు స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్.

రిజెక్షన్స్ ఎదురైనప్పుడు గుండె బరువెక్కిపోతుంది.. షాకింగ్‌గా స్టార్ డైరెక్టర్ కామెంట్స్
X

దిశ, సినిమా: రిజెక్షన్స్ ఎదురైనప్పుడు గుండె బరువెక్కిపోతుంది. కానీ వాటిని స్వీకరించినప్పుడు మాత్రమే జీవితం ముందకు సాగుతుంది అని చెప్పుకొచ్చాడు స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్. తాజాగా ఆయన పూరి మ్యూజింగ్స్‌లో ఈ విషయాలపై మాట్లాడుతూ.. ‘రిజెక్షన్ అనేది సహజం. అది ఉద్యోగ అవకాశం కావచ్చు, ఏదైనా రిలేషన్ కావచ్చు, మీరు ఎన్నాళ్ల నుంచో ఆశించిన కల కావచ్చు. ఇలా ఏవిషయంలో అయినా రిజెక్షన్స్ ఎదురైనప్పుడు వాటిని మనం స్వీకరించినప్పుడే జీవితం ముందుకుసాగుతుంది. రిజెక్షన్ ఎదురైనప్పుడు గుండె బరువెక్కిపోతుంది, ఇక ఇంతేనా అనిపిస్తుంది. కానీ వాటిని పట్టించుకోకుండా ముందుకు సాగాలి. ఎవరో మిమ్మల్ని కాదు అనుకున్నంత మాత్రన అక్కడితో మీ ప్రయాణం ఆపేయాల్సిన అవసరం లేదు, మీ విలువ కూడా ఏం తగ్గిపోదు.. మళ్లీ కొత్తగా ప్రారంభించాలి. వాటిని మించిన కొత్త అవకాశాలు రావచ్చేమో. అందుకే ఎప్పుడు ప్రయాణం ఆపకూడదు’ అంటూ చెప్పుకొచ్చాడు.

Next Story