తమిళ నటుడు సంతానం హారర్ మూవీ అప్డేట్.. చుట్టూ సమాధులతో టైటిల్‌తో పోస్టర్ రిలీజ్

by Chukka Sudharani |

విభిన్నమైన పాత్రలు, కథలు ఎంచుకుంటూ భాషతో సంబంధంలో లేకుండా తెలుగు, తమిళంలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు నటుడు సంతానం.

తమిళ నటుడు సంతానం హారర్ మూవీ అప్డేట్.. చుట్టూ సమాధులతో టైటిల్‌తో పోస్టర్ రిలీజ్
X

దిశ, సినిమా: విభిన్నమైన పాత్రలు, కథలు ఎంచుకుంటూ భాషతో సంబంధంలో లేకుండా తెలుగు, తమిళంలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు నటుడు సంతానం. ఈ క్రమంలోనే త్వరలో హారర్ కామెడీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు. AGS ఎంటర్‌టైన్మెంట్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సెల్విన్ రాజ్ జేవియర్ దర్శకత్వం వహిస్తుండగా.. తాజాగా ఈ మూవీ టైటిల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ చిత్రానికి లవ్ బైట్ అని వినూత్న టైటిల్‌ను ఫిక్స్ చెయ్యగా.. ‘అపార ప్రతిభావంతుడైన సంతానం, అండ్ మా దర్శకుడు సెల్విన్‌రాజ్ జేవియర్ కాంబినేషన్‌లో మా రాబోయే చిత్రాన్ని ప్రకటించడానికి చాలా థ్రిల్ అవుతున్నాము. అద్భుతమైన నటీనటులు, అండ్ సాంకేతిక బృందంతో Ags సంస్థ నుండి వస్తున్న ‘లవ్ బైట్’ ఒక సూపర్ ఫన్ వైల్డ్ రైడ్ కానుంది’ అంటూ పోస్టర్ రిలీజ్ చేశారు. చుట్టూ సమాధులు, దెయ్యం చేతులు మధ్యలో లవ్ బైట్ బోర్డు సినిమాపై ఎక్స్‌పెక్టేషన్స్‌ను పెంచుతున్నాయి.

Next Story