- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నటుడు సల్మాన్‌ఖాన్‌కు దిమ్మతిరిగే షాక్.. నోటీసులు ఇచ్చిన పోలీసులు
బాలీవుడ్ స్టార్ నటుడు సల్మాన్ ఖాన్‌కు మరో బిగ్ షాక్ తగిలింది.

X
దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ స్టార్ నటుడు సల్మాన్‌ఖాన్ (Salman Khan)కు మరో బిగ్ షాక్ తగిలింది. తాజాగా ఆయనకు రాజస్థాన్ (Rajasthan) పోలీసులు విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేశారు. ఇటీవల సల్మాన్ ఓ పాన్ మసాలా కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అయితే, సల్మాన్ ప్రచారం చేసిన యాడ్ ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉందని, యువత పెడదోవ పట్టేందుకు, చెడు అలవాట్లకు బానిసలయ్యే అవకాశం ఉందని ఆరోపిస్తూ రాజస్థాన్‌కు చెందిన ఓ వ్యక్తి వినియోగదారుల కోర్టు (Consumer Court)లో పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు ఆ పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయమూర్తి సల్మాన్ ఖాన్‌ను విచారణకు హాజరు కావాలంటూ రాజస్థాన్ పోలీసుల ద్వారా సల్మాన్‌కు నోటీసులు పంపారు. అదేవిధంగా పాన్ మసాలా (Pan Masala) తయారీ సంస్థకు కూడా నోటీసులు జారీ అయ్యాయి.
Next Story






