- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
లండన్‌లో రామ్ చరణ్ మైనపు విగ్రహావిష్కరణ.. ఎలిజబెత్-2 తర్వాత మన గ్లోబల్ స్టారే అంటా!
లండన్‌లోని ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ప్రముఖ నటుడు రామ్ చరణ్ మైనపు విగ్రహం ఏర్పాటు చేయనున్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో: (London) లండన్‌లోని ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ (Madame Tussauds) మ్యూజియంలో ప్రముఖ నటుడు రామ్ చరణ్ (Actor Ram Charan) మైనపు విగ్రహం ఏర్పాటు చేయనున్నారు. తాజాగా లండన్‌లో గ్లోబల్ స్టార్ చరణ్ తానే స్వయంగా విగ్రహావిష్కరణ చేశారు. ఈ కార్యక్రమానికి రామ్ చరణ్‌తో పాటు భార్య ఉపాసన, తల్లిదండ్రులు చిరంజీవి, సురేఖ, కుమార్తె క్లీంకార సైతం పాల్గొన్నారు. రామ్ చరణ్ సోఫాలో కూర్చున్నట్లుగా (wax statue) మైనపు విగ్రహాన్ని రూపొందించారు. ఈ మైనపు విగ్రహంలో ఆయనతో పాటు తన పెంపుడు కుక్క రైమ్ కూడా ఉండటం అందరినీ ఆకట్టుకుటోంది.
ఈ విధంగా పెంపుడు జంతువుతో కలిసి ఉన్న మైనపు విగ్రహం కలిగిన సెలబ్రిటీల్లో తొలి వ్యక్తి రాణి (Elizabeth-2) ఎలిజబెత్-2, రెండో వ్యక్తిగా రామ్ చరణ్ కావడం గమనార్హం. ఈ వేడుకలో చరణ్ తన పెంపుడు కుక్క రైమ్‌తో కలిసి తన మైనపు విగ్రహంతో ఫొటోలు దిగారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. స్టార్ నటులు ప్రభాస్, అల్లు అర్జున్ తర్వాత మేడమ్ టుస్సాడ్స్‌లో మూడో టాలీవుడ్ నటుడిగా రామ్ చరణ్ విగ్రహం ఉండటం మరో విశేషం. ఇక ఈ ప్రతిమను సింగపూర్‌లోని మేడమ్ టుస్సాడ్స్‌కు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ తర్వాత విగ్రహం అక్కడే శాశ్వతంగా ఉంటుంది.






