హీరోగా చెయ్యడం కాస్త టెన్షన్‌గానే ఉంది.. నటుడు ఆసక్తిక కామెంట్స్

by Chukka Sudharani |

కమెడియన్‌గా, నటుడిగా తనకంటూ స్పెషల్ క్రేజ్ తెచ్చుకున్న నటుడు ప్రవీణ్.. ఇప్పుడు హీరోగా నటిస్తున్న తొలి చిత్రం ‘బకాసుర రెస్టారెంట్‌’.

హీరోగా చెయ్యడం కాస్త టెన్షన్‌గానే ఉంది.. నటుడు ఆసక్తిక కామెంట్స్
X

దిశ, సినిమా: కమెడియన్‌గా, నటుడిగా తనకంటూ స్పెషల్ క్రేజ్ తెచ్చుకున్న నటుడు ప్రవీణ్.. ఇప్పుడు హీరోగా నటిస్తున్న తొలి చిత్రం ‘బకాసుర రెస్టారెంట్‌’. హంగర్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ మూవీకి ఎస్‌జే శివ దర్శకత్వం వహిస్తుండగా.. వైవా హర్ష టైటిల్‌ రోల్‌లో నటిస్తున్నారు. కృష్ణభగవాన్‌ ,షైనింగ్‌ ఫణి, కేజీఎఫ్‌ గరుడరామ్‌ తదితరులు ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా ఈనెల 8న రిలీజ్ కాబోతుండగా.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నటుడు ప్రవీణ్ మూవీకి సంబంధించిన మరిన్ని విషయాలు పంచుకున్నాడు.

‘ఈ సినిమా ఐదు పాత్రలతో నడుస్తుంది. ఇందులో కథను నడిపించే పరమేష్‌ అనే పాత్రలో నేను కనిపిస్తాను. నా పాత్రలో ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు ఎమోషన్‌ కూడా ఉంటుంది. నా పాత్రకు ఉండే ఓ యాంబిషన్‌ ఎలా ఫుల్‌ఫిల్‌ అయ్యింది అనేది ఆసక్తికరంగా ఉంటుంది. మొదటి హీరో పాత్ర చెయ్యడం కొంచెం బరువుగానే అనిపించింది. పర్‌ఫార్మెన్స్‌ వైజ్‌ నాది రెగ్యులర్‌ పాత్ర కాదు. కథలో హారర్‌, థ్రిల్లర్‌, మైథాలజీ ఇలా అన్నీ మిక్స్‌ అయ్యాయి. ఐదు పాత్రలున్న కథను నడిపించే మెయిన్ పాత్ర కావడంతో కాస్త టెన్షన్‌గానే ఉంది.. అయితే ప్రేక్షకులకు ఈ మూవీ మంచి ఎంటర్‌టైన్మెంట్ ఇస్తుందని టీమ్ అంతా చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం’ అని తెలిపాడు.

Next Story