- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అన్‌ఫాలో చేశాకా వెళ్లి కలిశాను.. ఆయన ఏమన్నారంటే.. రిషబ్ శెట్టిపై నటుడు ప్రమోద్ శెట్టి కామెంట్స్
రాజ్, రక్షిత్, ప్రమోద్, ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్ ఖాతాలను అన్‌ఫాలో చేసిన తర్వాత రిషబ్ శెట్టిని కలిసి అసలు విషయం తెలుసుకున్నా: ప్రమోద్ శెట్టి.

దిశ, సినిమా: కన్నట స్టార్ రిషబ్ శెట్టి ఈ మధ్య కాలంలో ఎక్కువగా వార్తల్లో నిలిస్తున్నారు. సోషల్ మీడియాలో తన స్నేహితులు రాజ్, రక్షిత్, ప్రమోద్‌లతో పాటు ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్ ఖాతాలను అన్‌ఫాలో చేసి సంచలనం సృష్టించారు. దీంతో వారి మధ్య ఏవో వివాదాలు నడుస్తున్నాయని అందుకే ఆయన అన్‌ఫాలో చేశారంటూ నెట్టింట పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి. అయితే.. దీనిపై తాజాగా రిషబ్ శెట్టి ఫ్రెండ్, నటుడు ప్రమోద్ శెట్టి రియాక్ట్ అయ్యారు. ‘రిషబ్, రక్షిత్, రాజ్, నేను మంచి స్నేహితులం. ఆ విషయం అందరికి తెలుసు. సినిమా టైమ్‌లోనే మేమంతా సోషల్ మీడియాను వాడుతుంటాం. తర్వాత అంత యాక్టీవ్‌గా ఉండము. ఇటీవల రిషబ్ మా ఖాతాలను అన్‌ఫాలో చేశారనే విషయం వేరే వాళ్ల ద్వారా నాకు తెలిసింది. రిషబ్ ఎందుకిలా చేశారనేది పూర్తిగా తెలియదు కానీ, తర్వాత ఒకసారి కలిస్తే.. నిర్మాతగానూ మంచి ప్రాజెక్టులు ప్రేక్షకులకు అందించాలనుకుంటున్నానని తను నాతో చెప్పాడు. అయితే.. హోంబలే ఫిలిమ్స్‌ను అన్‌ఫాలో చేయడానికి గల కారణాన్ని నిదానంగా చెప్తాను అన్నారు’ అని చెప్పుకొచ్చాడు ప్రమోద్.






