‘ఇలాంటి గుండాల వల్లే?’.. నటుడు ప్రకాష్ రాజ్ సంచలన వ్యాఖ్యలు

by Jakkula.Mamatha |

దేశవ్యాప్తంగా ధర్మస్థలి మిస్టీరియస్ మర్డర్స్ కేసు సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే.

‘ఇలాంటి గుండాల వల్లే?’.. నటుడు ప్రకాష్ రాజ్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ,వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా ధర్మస్థలి మిస్టీరియస్ మర్డర్స్ కేసు సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ధర్మస్థల సామూహిక అంత్యక్రియల కేసును కవర్ చేస్తున్న పలువురు మీడియా ప్రతినిధులపై నిన్న(బుధవారం) సాయంత్రం కొంతమంది వ్యక్తులు దాడి చేశారు. ఈ ఘటన పంగలలోని దివంగత సౌజన్య నివాసానికి సమీపంలో జరిగింది.

ధర్మస్థలం వద్ద మీడియా ప్రతినిధులు ఫొటో, వీడియోలు తీస్తుండడాన్ని గమనించిన కొందరు గుంపులుగా వారి వద్దకు వచ్చారు. ఈ క్రమంలో ధర్మస్థలం కేసు దర్యాప్తులో భాగంగా.. తప్పుదారి పట్టించే నివేదికలను వ్యాప్తి చేస్తున్నారని ఆరోపిస్తూ గొడవకు దిగారు. ఈ క్రమంలోనే ముగ్గురు యూట్యూబర్ల పై దాడి చేశారని, వారి కెమెరా పరికరాలు విరిగి పోయినట్లు తెలుస్తోంది. ఈ ఘటనను గమనించిన పోలీసులు జన సమూహాన్ని చెదరగొట్టడానికి పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. గాయపడిన జర్నలిస్టులను ఉజిరేలోని ఆసుపత్రికి తరలించారు.

ఈ తరుణంలో కర్ణాటకలోని ధర్మస్థలంలో విధులు నిర్వహిస్తున్న మీడియా ప్రతినిధులపై జరిగిన దాడిని సినీ నటుడు ప్రకాష్ రాజ్ తీవ్రంగా ఖండించారు. ఇలాంటి గూండాల వల్లే భక్తులు విశ్వసించే ధర్మస్థలంకు కళంకం వస్తోందంటూ వీడియో విడుదల చేశారు. ఈ క్రమంలో సౌజన్య దారుణ హత్యకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తే, వారు ఎందుకు కోపంగా ఉన్నారని ప్రశ్నించారు. దయచేసి నిందితులను అరెస్టు చేసి నిజం బయటకు తీసుకురండి అని ప్రకాష్ రాజ్ పేర్కొన్నారు.

Next Story