నటుడు ప్రకాశ్ రాజ్ ఇంట తీవ్ర విషాదం

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-03-30 05:33:22  IST  )

నటుడు ప్రకాశ్ రాజ్ ఇంట విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన తల్లి సువర్ణలత కన్నుమూశారు.

నటుడు ప్రకాశ్ రాజ్ ఇంట తీవ్ర విషాదం
X

దిశ, వెబ్‌డెస్క్: విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి సువర్ణలత (86) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో సతమతమవుతున్న ఆవిడ.. సోమవారం ఉదయం ఇంటిలోనే తుదిశ్వాస విడిచినట్లు కుటుంబసభ్యులు వెల్లడించారు. సాయంత్రం బెంగళూరులోనే ఆమె భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. కాగా.. గతంలో నైటింగేల్స్ మెడికల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ డిమెన్షియా సదస్సులో ప్రకాశ్ రాజ్ మాట్లాడుతూ.. తన తల్లికి మెదడులో చిన్న కణితికి సర్జరీ చేశారని, ఆ సమయంలో మూడురోజులపాటు ఆమె మెమొరీలాస్ కు గురయ్యారని పేర్కొన్నారు. ఆ తర్వాత కొంతకాలానికి ఆమె కోలుకున్నారని తెలిపారు. ఇక ప్రకాశ్ రాజ్ విషయానికొస్తే.. హీరో, విలన్, తండ్రి, సోదరుడు పాత్రలతో తెలుగు ప్రేక్షకులకు ప్రకాశ్ రాజ్ దగ్గరైన విషయం తెలిసిందే. తన నటనతో ఆయన ఇండస్ట్రీలో స్టార్ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా తెరకెక్కిన స్పిరిట్ సినిమాలో ప్రకాశ్ రాజ్ కీలకపాత్రలో కనిపించనున్నారు.

షూటింగ్ సెట్‌లో ఘోరం.. సముద్రపు అలల్లో కలిసిపోయిన స్టార్ హీరో!

Next Story