- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Actor Parthiban: కచ్చితంగా పవన్ కళ్యాణ్ ఏపీ సీఎం అవుతాడు
డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్, ఏదో ఒక రోజు AP ముఖ్యమంత్రి అవుతారని సంచలన వ్యాఖ్యలు చేశారు ఆర్. పార్థిబన్.

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై ( DCM Pawan Kalyan) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు తమిళ స్టార్ నటుడు ఆర్. పార్థిబన్ ( Actor Parthiban) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్, ఏదో ఒక రోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అవుతారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయనకున్న పట్టుదల, కష్టపడే తత్వం కారణంగా ముఖ్యమంత్రి కావడం గ్యారెంటీ అన్నారు ఆర్. పార్థిబన్. ఇలాంటి నటుడిని.. తాను ఎప్పుడూ చూడలేదని ప్రశంసించారు. పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ ( Ustaad Bhagat Singh) సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది. యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో ఆదివారం రోజున ఈ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో నటించిన ప్రముఖ నటుడు ఆర్. పార్థిబన్ మాట్లాడారు.
పవన్ కళ్యాణ్ ఏపీ సీఎం అవుతాడు
ఏదో ఒక రోజున ఏపీ ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు తీసుకుంటారని ధీమా వ్యక్తం చేశారు ఆర్. పార్థిబన్. కాగా ఈ సినిమాలో ప్రత్యేక పాత్రలో ఆర్. పార్థిబన్ నటిస్తున్నాడు. ఆయన విలన్ గా ఉంటాడని అంటున్నారు. కాగా పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఉగాది కానుకగా మార్చి 19వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. మార్చి 26వ తేదీన రిలీజ్ చేయాలని అనుకున్నప్పటికీ, వారం రోజులు ముందుగానే రిలీజ్ చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ హీరోగా చేస్తుండగా శ్రీ లీల, రాశిఖన్నా హీరోయిన్ లుగా మెరువనున్నారు. ఈ మూవీకి హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తుండగా దేవి శ్రీ ప్రసాద్ సంగీత స్వరాలు అందిస్తున్నారు. క్లిక్






