- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నడిరోడ్డుపై అండర్‌వేర్‌తో నడవమన్నా నడుస్తా.. నరేష్ సంచలన వ్యాఖ్యలు
టాలీవుడ్ నటుడు నరేష్ కీలక వ్యాఖ్యలు చేశాడు. నరేష్ నటించిన నారీనారీ నడుమ మురారి సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ఈరోజు జరగ్గా అందులో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాత్ర డిమాండ్ చేస్తే తాను నడిరోడ్డు మీద అండర్ వేర్ తో నిలబడటానికి కూడా రెడీ అని అన్నాడు.

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ నటుడు నరేష్ కీలక వ్యాఖ్యలు చేశాడు. నరేష్ నటించిన నారీనారీ నడుమ మురారి సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ఈరోజు జరగ్గా అందులో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాత్ర డిమాండ్ చేస్తే తాను నడిరోడ్డు మీద అండర్ వేర్ తో నిలబడటానికి కూడా రెడీ అని అన్నాడు. నటుడిగా ఎలాంటి లిమిటేషన్స్ పెట్టుకుంటారు అని రిపోర్టర్ అడిగిన ప్రశ్నలకు నరేష్ ఈ విధంగా సమాధానం ఇచ్చాడు. తాను నటుడిగా అసలు ఎలాంటి లిమిటేషన్స్ పెట్టుకోనని స్పష్టం చేశాడు.
సన్నివేశం డిమాండ్ చేస్తే నడిరోడ్డుపై నడిరోడ్డుపై అండర్ వేర్ తో నడవాలని చెప్పినా నడుస్తానని అన్నాడు. గుంటూరు కారం సినిమాలో బాత్రూంలో ఓ సన్నివేశం ఉంటుందని క్యారెక్టర్ నచ్చడంతో ఆ సన్నివేశంలో నటించానని అన్నారు. పాత్రలో నిజాయితీ, ఎమోషన్స్ ఉంటే అది ఎలాంటి పాత్ర అయినా నటిస్తానని అన్నాడు. ట్రోలింగ్, కామెడీ, నెగిటివ్ ఏ పాత్ర అయినా చేస్తానని చెప్పాడు. పర్సనల్ గా తీసుకోవద్దని, కేవలం అది ఒక పాత్ర మాత్రమేనని చెప్పారు.






