టాలీవుడ్ లో తీవ్ర విషాదం... రవితేజ విలన్ మృతి !

by velandi.Saikiran |   (  Updated:2025-05-24 06:16:10  IST  )

టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖ విలన్ మృతి చెందారు. తీవ్ర అనారోగ్యంతో ఆసు

టాలీవుడ్ లో తీవ్ర విషాదం... రవితేజ విలన్ మృతి !
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖ విలన్ మృతి చెందారు. తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన నటుడు ముకుల్ దేవ్ కాసేపటి క్రితం మృతి చెందాడు. 54 సంవత్సరాల ముకుల్ దేవ్ (mukul dev )... గత వారం రోజులుగా ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే ఆయన ఆరోగ్యం విషమించడంతో.. కాసేపటి క్రితమే మరణించినట్లు అధికారిక ప్రకటన విడుదలైంది.


ముకుల్ దేవ్... టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా సినిమాలు చేశాడు. ముఖ్యంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో విలన్ గా ముకుల్ దేవ్ కు మంచి క్రేజ్ ఉంది. రవితేజ నటించిన కృష్ణ సినిమాతో బాగా పాపులర్ అయ్యాడు. ఆ తర్వాత ఏక్ నిరంజన్, కేడి అలాగే అదుర్స్ లాంటి సినిమాల్లో కనిపించాడు ముకుల్ దేవ్. నటుడు రాహుల్ దేవ్ సోదరుడే ఈ విలన్ ముకుల్ దేవ్. తల్లిదండ్రుల మరణంతో... ముకుల్ దేవ్ కొంతకాలంగా ఒంటరిగా ఉంటున్నాడని చెబుతున్నారు.


ఒంటరి జీవితం తో ముకుల్ దేవ్ చాలా విసిగిపోయారట. ఈ నేపథ్యంలోనే.. ఆయన ఆరోగ్యం కూడా పాడైపోయినట్లు తెలుస్తోంది. దీంతో వెంటనే ఆయనను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. కానీ పరిస్థితి చేయి దాటిపోవడంతో.. తాజాగా మరణించారు. ఇక నటుడు ముకుల్ దేవ్ మృతి నేపథ్యంలో సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతున్నారు.

Next Story