- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘మా బావ ఇండియాలోనే టాప్ స్టార్’.. ప్రభాస్‌ను ప్రశంసలతో ముంచెత్తిన మోహన్ బాబు
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas)ను నటుడు మోహన్ బాబు(Mohan Babu) ప్రశంసలతో ముంచెత్తారు. కన్నప్ప మూవీ(Kannappa Movie) ప్రీరిలీజ్ ఈవెంట్‌ను శనివారం సాయంత్రం గుంటూరులో నిర్వహించారు.

దిశ, వెబ్‌డెస్క్: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas)ను నటుడు మోహన్ బాబు(Mohan Babu) ప్రశంసలతో ముంచెత్తారు. కన్నప్ప మూవీ(Kannappa Movie) ప్రీరిలీజ్ ఈవెంట్‌ను శనివారం సాయంత్రం గుంటూరులో నిర్వహించారు. ఈ ఫంక్షన్‌లో పాల్గొన్న మోహన్ బాబు మాట్లాడుతూ.. ‘నేను ప్రభాస్‌ను ముద్దుగా బావా అని పిలుస్తాను. తను కూడా నన్ను బావా అని పిలుస్తారు. ఎప్పటినుంచో మా ఇద్దరికి అలా అలవాటు అయ్యింది. ఒకరోజు ఫోన్ చేసి బావా నిన్ను కలవాలి అనుకుంటున్నాను అని అడిగాను. కన్నప్ప అనే సినిమా చేస్తున్నాం. అందులో నీకు సరిపోయే ఒక అద్భుతమైన క్యారెక్టర్ ఉంది. అది నువ్వే చేయాలి అని అడిగాను. దానికి ప్రభాస్ స్పందిస్తూ.. మీరెందుకు బావా అడగటం.. నేను విష్ణు మాట్లాడుకుంటాం కదా. నేను తప్పుకుండా ఈ సినిమాలో చేస్తాను అని ప్రభాస్ మాటిచ్చాడు’ అని మోహన్ బాబు చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఇండియాలోనే టాప్ స్టార్‌గా ప్రభాస్ ఉన్నారు. అతను ఎంత బిజీ యాక్టరో అందరికీ తెలుసు. అలాంటి వ్యక్తి మా సినిమాలో చేస్తుండటం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్యూ డార్లింగ్ అంటూ ఈ సందర్భంగా మోహన్ బాబు కృతజ్ఞతలు చెప్పారు.
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా రాబోతున్న ఈ కన్నప్ప చిత్రాన్ని తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు. హిందీ మహా భారతం ఫేమ్ ముఖేష్ కుమార్ సింగ్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో విష్ణుతో పాటు ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, కాజల్ అగర్వాల్, ఐశ్వర్య రాజేష్, శరత్ కుమార్, బ్రహ్మానందం, మధుబాల, ముఖేష్ రిషి, కరుణాస్, యోగి బాబు, సప్తగిరి, రఘు బాబు, దేవరాజ్, మంచు అవ్రామ్, అర్పిత్ రంకా (విష్ణు కూతుళ్లు) తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అవా ఎంటర్‌టైన్‌మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్స్‌పై మంచు మోహన్ బాబు అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రతిష్ఠాత్మకంగా కన్నప్ప సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్ సినిమాపై అంచనాలను పెంచేశాయి. జూన్ 27న కన్నప్ప సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.






