శ్రీలీలపై ట్రోలింగ్స్.. అసలు ఏం జరిగిందో క్లారిటీ ఇచ్చిన నటుడు మహేశ్

by Chukka Sudharani |

‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో జరిగిన ఇష్యూపై క్లారిటీ ఇచ్చిన మహేశ్.

శ్రీలీలపై ట్రోలింగ్స్.. అసలు ఏం జరిగిందో క్లారిటీ ఇచ్చిన నటుడు మహేశ్
X

దిశ, సినిమా: పవన్ కల్యాణ్, హరీశ్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం మార్చి 19న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు మేకర్స్. ఈ క్రమంలోనే ఈ ఈవెంట్‌కు సంబంధించి ఓ వీడియో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో శ్రీలీల వెనుక బజర్దస్త్ మహేశ్ నిలబడి ఉన్నాడు. శ్రీలీల వెనక్కి చూసిన క్రమంలో, తనను చూస్తుందనుకొని మహేశ్ ఆమె వైపు చూసి నవ్వుతాడు. కానీ మహేశ్‌ను ఏ మాత్రం పట్టించుకోకుండా సీరియస్‌గా చూస్తూ ముందుకు తిరిగింది. ఇక ఈ వీడియో కాస్త వైరల్ కావడంతో.. మహేశ్‌ను అవమానించింది అంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ స్టార్ట్ అయ్యాయి. ఈ క్రమంలోనే దీనిపై క్లారిటీ ఇచ్చాడు మహేశ్. ‘శ్రీలీల నాకు ఆవిడ ఫోన్ పట్టుకోమని ఇచ్చారు. ఆ తర్వాత ఆవిడ వెనక్కి చూస్తే నా వైపు ఫోన్ కోసం చూస్తున్నారు అనుకున్నా. కానీ ఈ లోపు శ్రీలీల పైకి స్క్రీన్ వైపు చూశారు. అంతే జరిగింది. ఇక్కడ ఎవరు ఎవరిని అగౌరవపరచలేదు’ అంటూ చెప్పుకొచ్చాడు.

Next Story