RRR ఆడిష‌న్ నాలో కాన్ఫిడెన్స్‌ను నెక్ట్స్ రేంజ్‌కు తీసుకెళ్లింది : కృష్ణ బూరుగుల‌

by Sujitha Rachapalli |

‘‘జిగ్రీస్’ నటుడిగా నాలో స‌రికొత్త ఉత్సాహాన్నిచ్చింది’’ అని అంటున్నారు కృష్ణ బూరుగుల‌. ఈయ‌న క‌థానాయ‌కుడిగా న‌టించిన ఈ చిత్రం న‌వంబ‌ర్ 14న రిలీజై మంచి స్పంద‌ను రాబ‌ట్టుకుంటోంది. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ ..

RRR ఆడిష‌న్ నాలో కాన్ఫిడెన్స్‌ను నెక్ట్స్ రేంజ్‌కు తీసుకెళ్లింది  :  కృష్ణ బూరుగుల‌
X

దిశ, సినిమా : ‘‘జిగ్రీస్’ నటుడిగా నాలో స‌రికొత్త ఉత్సాహాన్నిచ్చింది’’ అని అంటున్నారు కృష్ణ బూరుగుల‌. ఈయ‌న క‌థానాయ‌కుడిగా న‌టించిన ఈ చిత్రం న‌వంబ‌ర్ 14న రిలీజై మంచి స్పంద‌ను రాబ‌ట్టుకుంటోంది. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ ..

* నాన్న బిజినెస్‌, అమ్మ గృహిణి. నాన్న‌కు కూడా సినిమాల్లో న‌టించాల‌నే కోరిక ఉండేది. అయితే ఆయ‌న‌కు వీలు కాలేదు. నేను కూడా చిన్న‌ప్ప‌టి నుంచి న‌ట‌న‌పై ఉన్న ఇష్టంతో అష్టాచ‌మ్మా చిత్రంలో హీరో చిన్న‌ప్ప‌టి పాత్ర‌లో నేను న‌టించాను. కొన్ని షార్ట్ ఫిల్మ్స్‌లో యాక్ట్ చేశాను. మ‌హేంద్ర‌ చ‌క్ర‌వ‌ర్తిగారి ద‌గ్గ‌ర యాక్టింగ్‌లో శిక్ష‌ణ తీసుకున్న త‌ర్వాత సినీ ఇండ‌స్ట్రీలో అవ‌కాశాల కోసం మ‌రింత గ‌ట్టిగా ప్ర‌య‌త్నించాను.

* RRR కోసం రాజమౌళిగారు ఆడిష‌న్స్ చేస్తున్నార‌ని తెలిసింది. అయితే నాకు చిన్న యాక్సిడెంట్ కార‌ణంగా చెయ్యి ఫ్రాక్చ‌ర్ అయ్యుండింది. అయినా కూడా ఆడిష‌న్ చివ‌రి రోజు అని తెలిసి వెళ్లాను. అప్ప‌టికే చాలా మంది ఆడిష‌న్స్ చేసున్నారు. నేను ఫ్రాక్చ‌ర్‌తో ఉన్న‌ప్ప‌టికీ ఆడిష‌న్‌లో పాల్గొన్నాను. అది న‌చ్చ‌టంతో ఆ మూవీలో ఓ చిన్న రోల్ చేశాను. అది ఎడిటింగ్‌లో పోయింది. అయితే ఆ మూవీకి చేసిన ఆడిష‌న్‌.. ఆ స‌మ‌యంలో నా సిట్యువేష‌న్ ఇవ‌న్నీ నాలో తెలియ‌ని కాన్ఫిడెన్స్ పెంచి ఎన‌ర్జీనిచ్చింది. ఎందుకంటే ఫ్రాక్చ‌ర్ అయ్యిందిగా నేను వెళ్ల‌కుండా ఉండుంటే అవ‌కాశం నాకు ద‌క్కేది కాదు. క‌ష్ట‌ప‌డ్డాను కాబ‌ట్టి అంత పెద్ద సినిమాలో యాక్ట్ చేసే చాన్స్ వ‌చ్చింది. ఏదేమైనా యాక్ట‌ర్‌గా నిరూపించుకోవాల‌నే ప‌ట్టుద‌ల‌కు.. ఇంకా ఎక్కువ క‌ష్ట‌ప‌డితే క‌చ్చితంగా మంచి అవ‌కాశాలు వ‌స్తాయ‌నే ధైర్యం వ‌చ్చింది. దీంతో 100కి పైగా ఆడిష‌న్ వీడియోస్ షూట్ చేసి యూ ట్యూబ్‌లో అప్ లోడ్ చేశాను.

* ర‌విబాబుగారు డైరెక్ట్ చేసిన క్ర‌ష్ మూవీ హీరోగా నాకు డెబ్యూ మూవీ. త‌ర్వాత మానాన్న న‌క్స‌లైట్ సినిమాలో న‌టించాను. హరీష్ శంక‌ర్‌గారు షో ర‌న్న‌ర్‌గా చేసిన ఏటీఎం వెబ్ సిరీస్‌లో యాక్ట్ చేశాను. కొర‌టాల శివగారి స‌మ‌ర్ప‌ణ‌లో వ‌చ్చిన కృష్ణ‌మ్మ చిత్రంలో న‌టించాను. ఇవ‌న్నీ నాకు న‌టుడిగా మంచి గుర్తింపు తీసుకొచ్చిన‌వే.

* జిగ్రీస్ విష‌యానికి వ‌స్తే.. నాది ర‌గ్డ్‌, చిచోరే పాత్ర‌. నా రియ‌ల్ లైఫ్‌కు పూర్తి భిన్న‌మైన పాత్ర‌. స్క్రిప్ట్ తొలిసారి చ‌ద‌వ‌గానే అందులో ఉన్న కొత్త‌ద‌నం నాకు క‌నెక్ట్ అయ్యింది. ఆరు నెల‌ల పాటు సినిమా కోసం ప్రిపేర్ అయ్యాను. పాత్ర‌కు త‌గ్గ‌ట్టు లుక్ మార్చుకున్నాను. ప‌దే ప‌దే స్క్రిప్ట్ చ‌దువుతూ ఉండ‌టం వ‌ల్ల బాగా క‌నెక్ట్ అయ్యాను. అందుకే నా పాత్ర చూసి అంద‌రూ నాకు ఫోన్ చేసి అద్భుతంగా చేశాన‌ని అప్రిషియేట్ చేస్తున్నారు. డైరెక్ట‌ర్ సందీప్ వంగారు కూడా సినిమా చూసి చాలా బాగా చేశాన‌ని అప్రిషియేట్ చేశారు.. ఇంత రెస్పాన్స్ వ‌స్తుంద‌ని నేను అనుకోలేదు. సినిమా చూసిన నా ఫ్రెండ్స్‌తో పాటు చాలా మంది యూత్ సినిమాలోని నా పాత్ర‌కు క‌నెక్ట్ అయ్యారు. ఇది యాక్ట‌ర్‌గా నాకు ఉత్సాహాన్నిచ్చింది.

* నెక్ట్స్ సినిమా అవకాశాలు వ‌స్తున్నాయి. నేను క‌థ‌లు వింటున్నాను. త్వ‌ర‌లోనే సినిమాను స్టార్ట్ చేస్తాను. ఎన్ని సినిమాలు చేశామ‌నేది కాదు.. ఎలాంటి పాత్ర చేశామ‌ని.. యాక్ట‌ర్‌గా నా ఇంపాక్ట్ ఎలా ఉంద‌నే విష‌యాన్ని నేను గ‌ట్టిగా న‌మ్ముతాను.

Next Story