Kota Srinivasa Rao: నటుడు కోటా శ్రీనివాసరావు ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలిస్తే షాక్ అవుతారు.. వైలర్ అవుతోన్న ఫొటో

by Chukka Sudharani |

తెలుగు చిత్ర పరిశ్రమలో నటన, ప్రతిభతో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో సీనియర్ నటుడు కోటా శ్రీనివాసరావు ఒకరు.

Kota Srinivasa Rao: నటుడు కోటా శ్రీనివాసరావు ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలిస్తే షాక్ అవుతారు.. వైలర్ అవుతోన్న ఫొటో
X

దిశ, సినిమా: తెలుగు చిత్ర పరిశ్రమలో నటన, ప్రతిభతో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో సీనియర్ నటుడు కోటా శ్రీనివాసరావు ఒకరు. రకరకాల పాత్రల్లో నటిస్తూ.. తన నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న ఈయన ప్రస్తుతం ఏజ్ పెరగడంతో చిత్ర పరిశ్రమకు దూరం అయ్యారు. ఇక ఇటీవల ఓ టీవీ పోగ్రామ్‌లో కనిపించి ప్రేక్షకులకు మరోసారి ఆకట్టుకున్నారు. ఇదిలా ఉంటే.. ఈ మధ్య కాలంలో కోటా శ్రీనివాసరావు బయటకానీ, మీడియాలో కానీ పెద్దగా కనిపించడం లేదు. ఈ క్రమంలోనే ఈ రోజు నిర్మాత బండ్ల గణేష్ నటుడు కోటా శ్రీనివాసరావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే.. ఆ ఫొటోలో కోటా శ్రీనివాసరావు కాలుకు కట్లు కట్టి ఉంది. అంతే కాకుండా.. ఒక కాలు బాగా పాడై ఉండటంతో.. కోటకు ఏమైంది ఇలా పాడైపోయారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.

Next Story