- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జయం రవి రెండో పెళ్లి... వివాదంగా మారిన ఫోటో !
సౌత్ ఇండియా స్టార్ హీరో జయం రవి ( Jayam Ravi) సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. భార్యకు దూరంగా ఉంటున్న

దిశ, వెబ్ డెస్క్: సౌత్ ఇండియా స్టార్ హీరో జయం రవి (Jayam Ravi) సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. భార్యకు దూరంగా ఉంటున్న జయం రవి.. తాజాగా రెండో పెళ్లి చేసుకున్నట్లు సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్ అవుతున్నాయి. దీంతో కోలీవుడ్ చిత్ర పరిశ్రమ ఒక్కసారిగా షాక్ అయింది. తాజాగా జయం రవి అలాగే సింగర్ కెనీషా (Singer Kenisha).. ఇద్దరూ పూలదండలు వేసుకుని కనిపించారు. వాళ్ళిద్దరి మెడలో పూల దండలు కనిపించడంతో... నిజంగానే రెండో పెళ్లి చేసుకున్నారని.. సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు.
తాజాగా చెన్నైలోని మురుగన్ దేవాలయంలో...సింగర్ కెనీషా అలాగే జయం రవి ఇద్దరూ మెరిసారు. ఈ సందర్భంగా ఇద్దరి మెడలో పూలదండలు కనిపించాయి. పక్కనే పురోహితులు కూడా ఉన్నారు. దీంతో వీళ్ళిద్దరికీ పెళ్లి అయిందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. విడాకులు మంజూరు కాకుండానే జయం రవి రెండో పెళ్లి చేసుకున్నాడా ? ఇది నిజమేనా అంటూ సోషల్ మీడియాలో కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇందులో వాస్తవం లేదని మరి కొంతమంది చెబుతున్నారు.
ఓ సినిమా షూటింగ్ నేపథ్యంలో టెంపుల్ కి వెళ్ళగా...అక్కడ ప్రత్యేక పూజలు చేస్తే పూలదండలు వేశారట. అది రెండో పెళ్లి కాదని చెబుతున్నారు. ఇది ఇలా ఉండగా... తన భార్య ఆర్తి నుంచి విడాకులు తీసుకుంటున్నట్లు గత సంవత్సరం జయం రవి ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ తన భర్త నుంచి నెలకు 40 లక్షల భరణం ఇప్పించాలని.. తాజాగా కోర్టు మెట్లెక్కింది జయం రవి భార్య ఆర్తి. దీంతో వీళ్లిద్దరి విడాకులు అంశం కోర్టు పరిధిలో ఉంది. ఇలాంటి నేపథ్యంలో జయం రవి పూలదండలతో కనిపించడం హాట్ టాపిక్ అయింది.






