- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మందుబాబులకు అలర్ట్...టాలీవుడ్ నటుడు కీలక సూచనలు
మద్యం సేవించేటప్పుడు ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తాజాగా నటుడు హర్షవర్ధన్ తన అనుభవాన్ని పంచుకున్నారు.

దిశ, వెబ్ డెస్క్: మద్యపానం హానికరం. అయినప్పటికీ చాలామంది మద్యపానం సేవిస్తూ ఉంటారు. కొంతమంది లిమిట్ గా తీసుకుంటే, మరికొంతమంది పీకలదాకా తాగి అనారోగ్యం బారిన పడతారు. ఇక మరికొంతమంది మంచి ఆహారం తీసుకుంటూ మద్యం సేవిస్తారు. దానివల్ల ఆరోగ్యం పైన పెద్దగా ఎఫెక్ట్ పడబోదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఇలాంటి నేపథ్యంలోనే టాలీవుడ్ సీనియర్ నటుడు హర్షవర్ధన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మద్యపానం సేవించేటప్పుడు మంచినీళ్లు ఎక్కువగా తాగితే, ఎలాంటి టెన్షన్ ఉండదని స్పష్టం చేశారు.
మందుబాబులకు నటుడు హర్షవర్ధన్ సూచనలు
మద్యం సేవించేటప్పుడు ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తాజాగా నటుడు హర్షవర్ధన్ తన అనుభవాన్ని పంచుకున్నారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఒక పెగ్గు తాగిన తర్వాత కచ్చితంగా గ్లాస్ నీళ్లు తాగాలని కోరారు. అలా ప్రతి పెగ్గుకు నీళ్లు తాగడం వల్ల శరీరం పైన మద్యం ప్రభావం తగ్గుతుందని హర్షవర్ధన్ స్పష్టం చేశారు. నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి ఈ పద్ధతిని పాటిస్తారని గుర్తు చేశారు. డ్రింక్ చేయడానికి ముందే అర లీటర్ నీళ్లు తాగడం వల్ల ఆరోగ్యాన్ని కొంతవరకు కాపాడుకోవచ్చని స్పష్టం చేశారు. దీంతో హర్షవర్ధన్ చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి. కాగా ఇటీవలే చిరంజీవి హీరోగా మన శంకర వర ప్రసాద్ గారు సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో నటుడు హర్షవర్ధన్ స్పెషల్ రోల్ చేశారు. ఈ సినిమా సంక్రాంతికి వచ్చి, బంపర్ హిట్ అందుకుంది.






