లైంగిక వేధింపుల కేసులో ప్రముఖ నటుడు దిలీప్‌ నిర్దోషి

by Muthe.Rajitha |

లైంగిక వేధింపుల కేసులో ప్రముఖ మలయాళీ నటుడు దిలీప్ నిర్దోషిగా తేల్చింది కోర్టు.

లైంగిక వేధింపుల కేసులో ప్రముఖ నటుడు దిలీప్‌ నిర్దోషి
X

దిశ, వెబ్ డెస్క్ : లైంగిక వేధింపుల కేసులో ప్రముఖ మలయాళీ నటుడు దిలీప్ నిర్దోషిగా తేల్చింది కోర్టు. దీనితో దేశవ్యాప్తంగా సంచలనం రేపిన #MeToo ఉద్యమానికి నాంది పలికిన దిలీప్ లైంగిక వేధింపుల కేసు ముగిసింది. కేరళలో 2017లో మలయాళ నటుడు దిలీప్ (పీ. గోపాలకృష్ణన్) మీద లైంగిక వేధింపుల కేసు నమోదైంది. ఈకేసులో ఆరోపణలపై తగిన రుజువులు చూపించలేకపోయిన కారణం చేత ఎర్నాకులంసెషన్స్ కోర్టు దిలీప్ ను నిర్దోషిగా ప్రకటించారు.

తమను దిలీప్ లైంగికంగా వేధించాడు అంటూ పలువురు ప్రముఖ నటీమణులు ఆరోపణలు చేయడంతో మొదలైన ఈ కేసు 8 ఏళ్ల పోరాటం తర్వాత ముగిసింది. అయితే ఈ వ్యయహరంతో దేశవ్యాప్తంగా ఎంతోమంది నటీమణులు ఇండస్ట్రీలో తమపై జరిగిన లైంగిక హింసను బయట పెట్టారు. ఇది #MeToo మూవ్‌మెంట్‌కు కూడా దారితీసి, తీవ్ర చర్చలు కూడా జరిగాయి.

Next Story