రాజకీయ రంగప్రవేశంపై నటుడు బ్రహ్మానందం క్లారిటీ

by Gantepaka Srikanth |

రాజకీయ రంగప్రవేశంపై నటుడు బ్రహ్మానందం క్లారిటీ ఇచ్చారు.

రాజకీయ రంగప్రవేశంపై నటుడు బ్రహ్మానందం క్లారిటీ
X

దిశ, వెబ్‌డెస్క్: సీనియర్ ఎన్టీఆర్ నుంచి పవన్ కల్యాణ్ వరకు అనేక మంది సినిమా స్టార్లు రాజకీయాల్లోకి వచ్చారు. కొంతమంది రాణించారు.. మరికొంత మంది మనకు సెట్ కాదని భావించి వెనుదిరిగారు. ఈ క్రమంలోనే ఇండస్ట్రీ నుంచి మరొక కీలక నటుడు రాజకీయాల్లోకి రాబోతున్నారంటూ ఇటీవల వార్తలు విస్తృతం అయ్యాయి. హాస్య బ్రహ్మ, నటుడు బ్రహ్మనందం(Brahmanandam) రాజకీయాల్లోకి రాబోతున్నారనే వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. తాజాగా ఈ వార్తలపై ఆయన క్లారిటీ ఇచ్చారు. శుక్రవారం ఆయన ఓ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ.. ‘నాకు రాజకీయాల్లోకి(Telugu Politics) వచ్చే ఆలోచన లేదు.. దాదాపు అన్ని జనరేషన్ల వాళ్లతో నటించాను.. నాలుగు జనరేషన్లతో కలిసి నటించాను.. ఇంతకంటే గొప్ప గౌరవం ఇంకేం ఉంటుంది. ఈ జీవితానికి ఇంకేం అవసరం లేదు’ అని నటుడు బ్రహ్మానందం చెప్పుకొచ్చారు. కాగా, తెలుగు సహా అనేక భాషల్లో బ్రహ్మానందం నటించారు. మొత్తం 1250కి పైగా సినిమాలలో నటించి 2010లో గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కాడు. 2009లో భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం ఇచ్చింది. ఉత్తమ హాస్య నటుడిగా ఐదు నంది పురస్కారాలు, ఒక ఫిల్మ్ ఫేర్ పురస్కారం, ఆరు సినీ మా అవార్డులు, మూడు సైమా పురస్కారాలు అందుకున్నారు.

Next Story