- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Ajith: ‘పక్కవారి గురించి ఆలోచించకుండా కష్టపడి పని చేయండి’ గట్టిగా ఇచ్చిపడేసిన ప్రముఖ హీరో
ఇతరుల పర్సనల్ విషయాల్లో జోక్యం చేసుకోవడం వల్ల ఎవరికీ ఏమాత్రం యూజ్ ఉండదంటూ తమిళ ప్రముఖ హీరో అజిత్(Tamil famous hero Ajith) తాజాగా కామెంట్స్ చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: ఇతరుల పర్సనల్ విషయాల్లో జోక్యం చేసుకోవడం వల్ల ఎవరికీ ఏమాత్రం యూజ్ ఉండదంటూ తమిళ ప్రముఖ హీరో అజిత్(Tamil famous hero Ajith) తాజాగా కామెంట్స్ చేశారు. ఇటీవలే ఈయన కారు రేసింగ్(Car racing)లో సత్తా చాటిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అజిత్ ఫ్యాన్స్ మధ్య జరిగే వార్ గురించి మాట్లాడారు. మీరు చేయాల్సిన పని సవ్యంగా చేసుకోండని.. పక్కవారి విషయాల్లో జోక్యం చేసుకుంటే ఏం వస్తుందని అన్నారు. కష్టపడి పని చేసుకోండని తెలిపారు.
అలాగే మీ తోటి వ్యక్తులు అది చేస్తున్నారు.. ఇది చేస్తున్నారని ఎక్కువగా ఇతరుల విషయాల గురించి ఆలోచించకుండా మీరేం చేస్తున్నారని ఆలోచించుకోండని.. మీ లైఫ్ మీద ఫోకస్ పెట్టండని చెప్పుకొచ్చారు. అలా హైరానా పడడం వల్ల మీకు వచ్చే లాభమేం లేదంటూ గట్టిగానే అన్నారు. అలాగే నటుడు అజిత్ తమ అభిమానులకు ఓ మాట చెప్పారు. ఫ్యాన్స్ చూడడం వరకు బాగానే ఉంటుందని.. కానీ జై అజిత్ అనడం ఎందుకు.. మరీ నువ్వు ఎప్పుడు బాగుపడతావని అన్నారు. మీరు చూపిస్తోన్న అభిమానానికి హ్యాపీగా ఉంది.. కానీ మీ లైఫ్ తర్వాతే ఎవరైనా అని సూచించారు. ఫ్యాన్స్ సంతోషంగా ఉంటే తను కూడా హ్యాపీ అని తెలిపారు.
అలాగే లైఫ్ చాలా చిన్నదని.. మన మునివళ్లు కూడా మనల్ని గుర్తు ఉంచుకునే రోజులు కావని అన్నారు. కాగా ప్రతి విషయాన్ని మైండ్ లో ఉంచుకుని ప్రతి క్షణాన్ని ఆస్వాదించండని పేర్కొన్నారు. ఏదోక రోజు అందరూ చనిపోతారని.. కాగా కష్టపడి చేయడి.. జరిగిపోయిన దాని గురించి అస్సలు ఆలోచించవద్దని, ప్రస్తుతం గురించి ఎలాంటి భయం లేదని ఇప్పుడున్న క్షణాన్ని ఆస్వాదించాలని వెల్లడించారు. శారీరకంగానే కాదు.. మానసికంగానూ అభిమానులందర్ని ప్రేమిస్తానని తెలిపారు.






