యాక్షన్ మోడ్‌ ఆన్.. ప్రజెంట్ నీల్- ఎన్టీఆర్ మూవీ షూటింగ్ జరుగుతుంది అక్కడే..!

by I. Sairam |   (  Updated:2026-01-05 06:39:17  IST  )

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(NTR) ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌(Prashanth Neel)తో ‘డ్రాగన్’(వర్కింగ్ టైటిల్) అనే సినిమా చేస్తున్నాడు.

యాక్షన్ మోడ్‌ ఆన్.. ప్రజెంట్ నీల్- ఎన్టీఆర్ మూవీ షూటింగ్ జరుగుతుంది అక్కడే..!
X

దిశ, వెబ్‌డెస్క్: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(NTR) ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌(Prashanth Neel)తో ‘డ్రాగన్’(వర్కింగ్ టైటిల్) అనే సినిమా చేస్తున్నాడు. ఈ మూవీలో యంగ్ బ్యూటీ రుక్మిణి వసంత్(Rukmini Vasanth) హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని భారీ నిర్మాణాల సంస్థ మైత్రీ మూవీమేకర్స్‌ నిర్మిస్తున్నది. అయితే ఎన్టీఆర్ ఈ మూవీ కోసం చాలా సన్నగా మారిన సంగతి తెలిసిందే. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ క్రమంలో ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ప్రజెంట్ ఈ సినిమా కొత్త షెడ్యూల్ హైదరాబాద్‌లో వేసిన ఒక భారీ సెట్‌లో మొదలయ్యిందట. ఈ షెడ్యూల్‌లో ప్రధాన పాత్రల మధ్య కొన్ని సీన్స్ తెరకెక్కించనున్నాడట. అలాగే ఎన్టీఆర్‌తో ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ కూడా చిత్రీకరించనున్నాడట. ఈ షెడ్యూల్ తర్వాత మరోసారి విదేశాలకు వెళ్లనున్నాడు ఎన్టీఆర్. అక్కడ జరిగే షెడ్యూల్‌తో మూవీ టాకీ పార్ట్ షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అవుతుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

Read More..

ది రాజాసాబ్ నుంచి మ‌రో అప్డేట్‌..గూస్ బంప్స్ రావాల్సిందే

Next Story