'ఏస్' ట్రైలర్ రిలీజ్.. మనల్ని ఎవడ్రా ఆపేది అనే డైలాగ్‌‌తో గూస్‌బంప్స్ తెప్పిస్తున్న వీడియో

by Gugulothu.Kavitha |   (  Updated:2025-07-31 06:34:12  IST  )

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి(Vijay Sethupathi) ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న తాజా చిత్రం ఏస్ (Ace).

ఏస్ ట్రైలర్ రిలీజ్.. మనల్ని ఎవడ్రా ఆపేది అనే డైలాగ్‌‌తో గూస్‌బంప్స్ తెప్పిస్తున్న వీడియో
X

దిశ, వెబ్‌డెస్క్: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి(Vijay Sethupathi) ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న తాజా చిత్రం ఏస్ (Ace). ఆరుముగకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో యంగ్ బ్యూటీ రుక్మిణి వసంత్(Rukmini Vasanth) హీరోయిన్‌గా నటించగా.. యోగి బాబు(Yogi Babu) కీలక పాత్రలో కనిపించనున్నారు. అలాగే దివ్య పిళ్లై, బబ్లూ పృథ్వీరాజ్, బి.ఎస్. అవినాష్, ముత్తు కుమార్, రాజ్ కుమార్, డెనెస్ కుమార్, ఆల్విన్ మార్టిన్, ప్రిస్సిల్లా నాయర్, జాస్పర్ సుపయ్య, కార్తీక్ జై, నాగులన్ మరియు జహ్రినారిస్ త‌దిత‌రులు ఈ సినిమాలో కీల‌క పాత్రల్లో న‌టిస్తున్నారు. అయితే దీనిని 7Cs ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ నిర్మిస్తుంది. కాగా ఈ చిత్రం మే 23న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సంద‌ర్భంగా మూవీ నుంచి ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు మేక‌ర్స్. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటుంది.

ఇక ట్రైలర్‌ను గమనించినట్లయితే.. 'బోల్ట్ కాశీ' అనే డిఫరెంట్ రోల్‌లో యంగ్ లుక్‌తో విజయ్ సేతుపతి అదరగొట్టారు. 'నా కళ్ల ముందు ఏమైనా అన్యాయం జరిగితే నేను ధైర్యంగా బోల్ట్‌గా ఎదిరిస్తాను.' అంటూ చెప్పే డైలాగ్ వేరే లెవల్. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ డైలాగ్ అయినటువంటి మనల్ని ఎవడ్రా ఆపేది అనే డైలాగ్‌ ట్రైలర్‌లోనే హైలెట్ అయిపోయింది. ఫైనల్‌గా 'డార్క్ వెబ్'లో జరిగే గ్యాంబ్లింగ్ క్రైమ్ ప్రధానాంశంగా మూవీ రూపొందినట్లు ట్రైలర్‌ను చూస్తే తెలుస్తోంది. ఇక విజయ్ సేతుపతి, యోగి బాబు కామెడీ నవ్వులు పూయిస్తోంది. యాక్షన్, కొన్ని సీన్స్ గూస్ బంప్స్ తెప్పించేలా ఉన్నాయి.

Next Story